Ads
మహేంద్ర సింగ్ ధోనీ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి…అటువంటి ధోనీ కేస్ ఎంటి అనుకుంటున్నారా…అయితే ఈ ఇది చదవండి….!
Video Advertisement
2013 సంవత్సరంలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ జి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరుగుతుంది అని దానితో ధోనీకి సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేశాడు.
ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోని 2014లో జీ టీవీ పైన, సదురు ఐపీఎస్ అధికారం పైన పరువు నష్టం దావా కేసు వేశాడు.తనకి 100 కోట్లు నష్టపరిహారం చెల్లించడంతోపాటు తనకి వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేయకుండా చూడాలని కోరాడు. ధోనీ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ధోని పరువుకి నష్టం కలిగించే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని జీ టీవీ పైన, సంపత్ కుమార్ పైన మధ్యంతర నిషేధం విధించింది.
అలాగే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ వివరణ పైన సంతృప్తి చెందని ధోని మరోసారి కోర్టు మెట్లు ఎక్కాడు. తన పరువుకు మరింత నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యానించాడని పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే ఈ కేసులు శుక్రవారం విచారించగా ఐపీఎస్ అధికారికి 15 రోజులు జైలు శిక్ష విధించారు. అయితే ఈ తీర్పును సవాలు చేసుకునేందుకు నెల రోజులపాటు శిక్షణ వాయిదవేసింది
End of Article