ఎప్పుడు ధోనిని తిడుతూ ఉంటాడు… కానీ సూర్య కుమార్ కెరీర్‌ని “గంభీర్” నాశనం చేసాడా?

ప్రస్తుతం టీం ఇండియాలో ఒక బిగ్గెస్ట్ స్టార్ సూర్యకుమార్ యాదవ్. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఫ్యాన్ బేస్ సంపాదించుకొని తన 360 డిగ్రీ బ్యాటింగ్ తో టీం ఇండియాకి బలంగా నిలిచారు. విరాట్ కోహ్లీ తర్వాత టాప్ ఆర్డర్ ఆపద్బాంధవుడు అయ్యారు. అయితే ఇలాంటి క్రికెటర్ ని గౌతమ్ గంభీర్ గుర్తించలేదు.

గౌతమ్ గంభీర్ సాధారణంగా చాలా మందిని చాలా విషయాల్లో విమర్శిస్తారు అనే సంగతి తెలిసిందే. అలాంటిది గంభీర్ కొన్ని సంవత్సరాల పాటు తన జట్టులో ఉన్న టాలెంట్ గుర్తించలేకపోయారు. సూర్య కుమార్ యాదవ్ 2012 లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఐపీఎల్ లో అడుగుపెట్టారు.

did gautam gambhir ruined surya kumar yadav career

కానీ సూర్యకుమార్ యాదవ్ కి గుర్తింపు వచ్చింది మాత్రం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కి ఆడిన తర్వాత మాత్రమే. దాదాపు 3 సంవత్సరాలు ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్ సభ్యుడిగా ఉన్నారు. అదే జట్టు కెప్టెన్ అయిన గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కి ప్లేస్ ఇచ్చారు. కానీ బ్యాటింగ్ కి దింపే స్థానంలో మాత్రం విఫలం అయ్యారు. 2014 ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కి మధ్య జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 7వ స్థానంలో బ్యాటింగ్ కి వెళ్లి 5 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌ గా ఉన్నారు.

gautam gambhir comments on ravindra jadeja 175 runs innings

అక్కడి నుండి సూర్యకుమార్ యాదవ్ రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయారు. అయినా కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో మాత్రం చివరిలోనే ఉన్నారు. అయినా కూడా తనకి వచ్చిన బంతుల్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేశారు. 2015 లో మళ్లీ ముంబై ఇండియన్స్ మీద 20 బంతుల్లో 46 పరుగులు చేసి కేకేఆర్‌ను గెలిపించారు సూర్యకుమార్ యాదవ్. ఆ ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు కొట్టారు. అక్కడి నుండి 2016 వరకు సూర్యకుమార్ యాదవ్ ని గంభీర్ 4వ స్థానంలో బ్యాటింగ్ లోకి దింపారు.

మళ్లీ 2017 లో లోయర్ ఆర్డర్ కి పరిమితం చేశారు. 2018 లో సూర్య కుమార్ యాదవ్ ని ముంబై ఇండియన్స్ జట్టు వేలంలో దక్కించుకుంది. అక్కడ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఆడారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ టాలెంట్ గమనించారు. అక్కడి నుండి సూర్యకుమార్ యాదవ్ కి సరిపోయే బ్యాటింగ్ ఆర్డర్ ఇచ్చారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియాకి కూడా కెప్టెన్ అవ్వడంతో సూర్యకుమార్ యాదవ్ ఇందులో కూడా 4వ స్థానంలో ఆడుతున్నారు.

did gautam gambhir ruined surya kumar yadav career

అయితే సూర్యకుమార్ యాదవ్ టాలెంట్ ని గౌతమ్ గంభీర్ 2014 లోనే గుర్తించి ఉంటే, అప్పుడే సూర్యకుమార్ యాదవ్ అద్భుతాలు చేసే వారు. కేవలం కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ విఫలం అవ్వడంతో, సూర్యకుమార్ యాదవ్ అతని కెరీర్ లో కొంత వెనుకబడ్డారు ఏమో అని, ఒకవేళ అప్పుడే గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కి తనకి తగ్గ అవకాశం ఇచ్చి ఉంటే ఈ పాటికి ఇంకా పెద్ద స్థాయిలో ఉండే వారు ఏమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.