CSK పై ఇదేం పిచ్చి ప్లాన్ అన్నారు…కానీ “దినేష్ కార్తీక్” కి అదే కలిసొచ్చింది.!

CSK పై ఇదేం పిచ్చి ప్లాన్ అన్నారు…కానీ “దినేష్ కార్తీక్” కి అదే కలిసొచ్చింది.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో ఆట తో పాటు స్ట్రాటజీ కూడా ముఖ్యం అనే లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్. బుధవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి కోల్కతా నైట్ రైడర్స్ జుట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేశారు దినేష్ కార్తీక్. తర్వాత 12వ ఓవర్ వరకు సునీల్ నరైన్ లాంటి బౌలర్ కి అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ నిర్ణయమే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించడానికి సహాయపడింది.

Video Advertisement

మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. రాహుల్ త్రిపాఠి (81: 51 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ చేసినా కూడా మిడిల్ ఆర్డర్     ఫెయిలవడంతో 167 రన్స్ కి ఆల్ అవుట్ అయింది. తర్వాత షేన్ వాట్సన్ (50: 40 బంతుల్లో 6×4, 1×6) చేశారు.

అప్పటివరకు అందరూ అక్కడ ఉన్న పరిస్థితిని చూసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధిస్తుంది అని అనుకున్నారు. అప్పుడు వచ్చారు సునీల్ నరైన్ (1/31). 12వ ఓవర్‌‌లో బౌలింగ్‌కి వచ్చిన సునీల్ నరైన్ మ్యాచ్ ‌లో వాట్సన్ ‌కి వేసిన బాల్ అర్థం అవ్వని వాట్సన్ ఎల్ బి డబ్ల్యు గా నిలిచారు.

నిజానికి సునీల్ నరైన్ 15 ఇన్నింగ్స్ లో ఎనిమిది సార్లు వాట్సన్ ని అవుట్ చేసి రికార్డ్ సొంతం చేసుకున్నారు. కానీ దినేష్ కార్తీక్ తన స్ట్రాటజీ తో కరెక్ట్ టైంలో సునీల్ నరైన్ ని పంపించారు. నరైన్ కి తోడు గా మరొక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించడానికి తోడ్పడ్డారు. కీలక దశలో ధోని వికెట్ తీసి గేమ్ చేంజ్ చేసారు. చివరి ఓవర్ వరకు రస్సెల్ కి కూడా బౌలింగ్ ఇవ్వలేదు. ఫామ్ లో ఉన్న పాట్ కమ్మిన్స్ తో మొదటి 10 ఓవర్ల లోనే 4 ఓవర్లు కంప్లీట్ చేయించారు. రస్సెల్ లాస్ట్ లో ఒక పక్క రన్స్ ఇవ్వకుండా మరోపక్క వికెట్స్ తీస్తూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి గెలుపు సొంతం అయ్యేలా చేసారు దాంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 157/5 స్కోర్ చేసింది.


End of Article

You may also like