దినేష్ కార్తీక్ ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఆటగాళ్లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 37 సంవత్సరాల వయసులో దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు డీ.కే..

Video Advertisement

ఐపీఎల్ 2022 సీజన్లో తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన దినేష్.. సౌతాఫ్రికాతో జరగబోయే అప్ కమింగ్ టీ 20 సిరీస్ కు ఎంపికయ్యాడు.

 

భారత సెలక్షన్ కమిటీ ఆయనను ఎంపిక చేయడంతో ఆనందోత్సాహాలలో మునిగిపోయాడు. ఈ సందర్భంగా దినేష్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా అన్నారు. మనపై నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపాడు. 2019 వన్డే ప్రపంచ కప్పు తర్వాత ఇండియా జట్టులో చోటు కోల్పోయిన కార్తీక్ మళ్లీ ఈ విధంగా ఇంటర్వ్యూ ఇస్తారని ఎవరూ కూడా ఊహించలేదు. ఆయన దేశ వాలీతోపాటు ఐపీఎల్లో కూడా సరిగా ఆడకపోవడంతో, కామెంటేటర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.

ఇక అందరూ రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఐపీఎల్ 2022 సీజన్ లో ఆర్సిబి టీం లోకి వచ్చిన అతను అనూహ్య పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు. లోయరార్డర్ లో అద్భుత బ్యాటింగ్ తో సంచలన విజయాలు అందించాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడితే 57.40 సగటుతో 287 పరుగులు చేసి 191.33 స్ట్రైక్ రేట్ సంపాదించాడు.

 

ఈ పర్ఫామెన్స్ ని చూస్తే ఈ సీజన్ లో దినేష్ కార్తీక్ ఏ విధంగా ఆడారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో టీమిండియా సెలెక్టర్లు చూపు ఆయనపై పడింది. ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ” నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీ వెంట వస్తాయి ” అని అన్నారు. నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తను ఇంకా కష్టపడతాను అని అన్నారు. రాయల్ చాలెంజ్ బెంగళూరు చక్కని ఆటతో ముంబై సహకారంతో ప్లే అప్స్ బెర్తు దక్కించుకుంది. ఇక ఈ రోజు లక్నో తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.