ట్రైన్ లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.? అయితే ఒకసారి ఈ విషయం తప్పక తెలుసుకోండి.!

ట్రైన్ లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.? అయితే ఒకసారి ఈ విషయం తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాం. మన నిత్యావసర వస్తువుల్లో ఫోన్ ఒక భాగం అయిపోయింది. చిన్న చిన్న పనుల నుండి చాలా ముఖ్యమైన పనులు వరకు కూడా ఫోన్ ద్వారానే జరుగుతాయి.

Video Advertisement

ఫోన్ లేకుండా ఒక మనిషి రోజువారీ జీవితం గడపడం అనేది చాలా కష్టం. అయితే మనం చాలా సందర్భాల్లో బయటికి వెళ్లినప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం పవర్ బ్యాంక్ తీసుకెళ్తాం. కొన్నిసార్లు ఒక్కడే ఛార్జింగ్ పెట్టుకోడానికి వీలుంటే ఆ సాకెట్ వాడుకుంటాం.

do not charge mobile in metros and trains

ముఖ్యంగా ప్రయాణాల్లో అయితే ఛార్జింగ్ అయిపోతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుగా చార్జింగ్ సాకెట్ పెడుతున్నారు. కానీ నీ మనం మెట్రోలో ప్రయాణించేటప్పుడు కానీ ట్రైన్లో ప్రయాణించేటప్పుడు కానీ అందులో ఉన్న ఛార్జింగ్ సాకెట్ వాడితే మనకే ప్రమాదం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

do not charge mobile in metros and trains

మెట్రో ట్రైన్స్ లో ఛార్జింగ్ పెడితే ఫోన్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయట. అలా చేయడం వల్ల ఫోన్ హ్యాక్ అవుతుందట. ట్రైన్స్ మెట్రో లో యుఎస్బి కనెక్టర్ (USB connector) తో మనం చార్జింగ్ పెడుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మన ఫోన్లో ఉండే డేటా ని హ్యాకర్స్ దృష్టిలో పడే అవకాశం ఉందట. అంతేకాక మనం మాములుగా ఉపయోగించేది 230v AC కరెంట్. కానీ ట్రైన్ లో వచ్చే సప్లై 110v DC కరెంట్. దీని వల్ల ఒకోసారి చార్జర్ మరియు ఫోన్ పాడయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే వీలైనంత వరకు మెట్రో లో కానీ ట్రైన్స్ లో కానీ ఛార్జింగ్ పెట్టడం తగ్గించాలి అని మనమే చూసుకోవాలి అని చెబుతున్నారు.


End of Article

You may also like