వాటర్ తాగేటప్పుడు నూటికి 90 % మంది ఈ తప్పులు చేస్తారు.. ఇలా అస్సలు చేయకండి..!

వాటర్ తాగేటప్పుడు నూటికి 90 % మంది ఈ తప్పులు చేస్తారు.. ఇలా అస్సలు చేయకండి..!

by Megha Varna

Ads

చాలా మంది తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యమే పాడవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

Video Advertisement

అలానే ఆరోగ్యం బాగుండాలంటే మంచి నీళ్లని కూడా తాగుతూ ఉండాలి. శరీరంలో సుమారు 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక తగినంత నీరు తప్పని సరిగా తీసుకుంటూ ఉండాలి. అయితే నీళ్ళని తీసుకునేటప్పుడు చాలా మంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. మరి ఆ తప్పులు ఏమిటో తెలుసుకుంటే మీరు ఆ తప్పులు చేయకుండా ఉండచ్చు.

తగిన మోతాదులో నీళ్లు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, జీర్ణ వ్యవస్థ మందగించడం, మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక తప్పనిసరిగా అవసరమైనంత నీళ్లను తీసుకోండి.
అలానే భోజనానికి అరగంట ముందు నీళ్ళని తాగాలి. అలాగే భోజనం తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. చాలా మంది కంగారుగా నించుని నీళ్లు తాగుతారు. అలా తాగడం నిజంగా తప్పు. కాబట్టి ఎప్పుడూ నీళ్లు తాగేటప్పుడు కూర్చుని తాగండి.


చల్లని నీళ్లు ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీళ్లు కానీ రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్లను కానీ తాగాలి. చల్లని నీళ్లు తాగడం వల్ల రక్తనాళాల్లో సమస్యలు వస్తాయి. కాబట్టి చల్లని నీళ్లు తాగద్దు.
ఎప్పుడూ కూడా పెద్ద మొత్తంలో నీళ్లు తాగకూడదు. ఇలా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పై ప్రభావం పడుతుంది.


తగిన మోతాదులో నీళ్లు తాగకపోతే మూత్రం పసుపు రంగులో వస్తుంది. కాబట్టి దానిని కూడా మీరు చూసుకుని నీళ్లు తాగండి.
దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ పదేపదే నీళ్లు తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి.


End of Article

You may also like