Ads
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. అయితే మన క్రికెటర్లు ఆడేటప్పుడు జెర్సీ ధరిస్తారు అనే విషయం అందరికీ తెలుసు. అయితే మనలో కొంతమందికైనా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. క్రికెటర్లు ప్రతి మ్యాచ్ కి కొత్త జెర్సీ ధరిస్తారా? అసలు మ్యాచ్ ఆడిన తర్వాత ఆ జెర్సీని ఏం చేస్తారు? క్రికెటర్స్ మ్యాచ్ ఆడిన తర్వాత జెర్సీని ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టెస్ట్ మ్యాచ్ కి 3 నుండి 8 జెర్సీలు ఇస్తారు. అదే క్రికెట్ సిరీస్ లో ఎక్కువ మ్యాచ్ లు ఉంటే గనక 10 నుండి 12 జెర్సీలు ఇస్తారు. సిరీస్ అయిన తర్వాత ఆ జెర్సీని డ్రై క్లీనింగ్ కి ఇస్తారు. డ్రై క్లీనింగ్ చేసిన తర్వాత అదే జెర్సీని ఉపయోగించాలా లేదా అనేది ఆ క్రికెటర్ మీద ఆధారపడి ఉంటుంది.
ఒక జెర్సీతో ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేసినా, బౌలర్ ఎక్కువ వికెట్లు తీసినా మొమెంటం కింద నెక్స్ట్ మ్యాచ్ లో ఆ క్రికెటర్ ఆ జెర్సీ ని ఉపయోగిస్తారు. లేకపోతే వేరే జెర్సీని ఉపయోగిస్తారు. ఇంకొంతమంది క్రికెటర్లు అయితే కొన్ని ఎన్జీవోలతో కలిసి ఆ జెర్సీని వేలం వేసి దానితో వచ్చిన డబ్బులని చారిటీకి ఇస్తారు.
కొంత మంది క్రికెటర్లు అయితే మ్యాచ్ అయిన తర్వాత ఆ జెర్సీని తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లి పోతారు. ఒకటో, రెండో మాత్రమే వాళ్ళు అలా తీసుకెళ్తారు. మిగిలిన జెర్సీలన్నిటినీ బీసీసీఐ బోర్డు కి సబ్మిట్ చేస్తారు. బీసీసీఐ ఆ జెర్సీలన్నిటిని స్పాన్సర్స్ అయిన నైక్ వాళ్ళకి పంపిస్తారు. నైక్ సంస్థ వీటన్నిటినీ రీసైకిల్ చేసి కొత్త జెర్సీలను తయారుచేస్తారు.
End of Article