Ads
ప్రపంచ కప్ తర్వాత ధోని గ్రౌండ్ లో కనిపించలేదు. అతని ఆట కోసం ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ తో ఆ ముచ్చట తీరనుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌండరీలతో విశ్వరూపం చూపించాడు ధోని. ఇక ఈ ఐపీఎల్ లో ధోని ఫాన్స్ కి పండగే అని ఫిక్స్ అయిపోయాము. ఇంతలో ఐపీఎల్ కి కరోనా కష్టం వచ్చి పడింది. ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ధోని చెన్నై నుండి జార్ఖండ్ లోని తన ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్ 15 కి కూడా ఐపీఎల్ మొదలవుతుందా లేదా అనే డౌట్ నెలకొంది క్రికెట్ ఫాన్స్ లో. ఇప్పుడు ధోని ఫాన్స్ కి కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
Video Advertisement
ఐపీఎల్ లో బాగా ఆడి ఒక ఫినిషర్ గా నిరూపించుకుంటే టీ 20 ప్రపంచ కప్ లో ఆడే అవకాశం ఉంటుంది అని బీసీసీఐ చెప్పింది. కానీ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుందో లేదో డౌట్. ఇప్పటికే ధోని వయసు 38 సంవత్సరాలు. ఈ వయసులో సెలెక్టర్ల దృష్టిలో పడటం కష్టమే. పైగా టీం ఇండియా కాంట్రాక్టులో కూడా ధోని పేరు లేదు. ఇక సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు ధోని అని అనుకుంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఐపీఎల్ లో మాత్రం మరో రెండు సంవత్సరాలు ఆడతారు అని చెన్నై సూపర్ కింగ్స్ టీం యాజమాన్యం చెప్పినా…అభిమానుల్లో మాత్రం కొంత ఆందోళన ఉంది. దీంతో ధోని కెరీర్ ఇక ముగిసినట్టేనా అని అనుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.
End of Article