మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? దాని దరిదాపుల్లో ఈ 2 వస్తువులను పొరపాటున కూడా ఉంచొద్దు.. ఎందుకంటే..?

మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? దాని దరిదాపుల్లో ఈ 2 వస్తువులను పొరపాటున కూడా ఉంచొద్దు.. ఎందుకంటే..?

by Anudeep

Ads

భారతీయుల్లో ఎక్కువ మంది తులసి మొక్కని పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందువులు ఈ మొక్కకి పెద్ద పీట వేస్తారు. దాదాపు ప్రతి హిందువు ఇంట్లోనూ ఓ తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. ఎంతో పవిత్రంగా దానిని పూజించుకుంటూ.. ఉదయం, సాయం సమయాల్లో ఆ మొక్క వద్ద దీపారాధన చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

ఇలా చేసుకుంటే శుభప్రదమని హిందువులు విశ్వసిస్తారు. అయితే.. అటువంటి తులసి మొక్క వద్ద కొన్ని వస్తువులను ఉంచకూడదని, ఉంచితే లక్ష్మి దేవి ఆగ్రహిస్తుందని చెబుతుంటారు.

basil 1

ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. తులసి మొక్కను హిందువులు నారాయణుడి రూపంగా భావించి పూజిస్తారు. అందుకే చాలా మంది తూరుపు దిక్కుగా తులసి కోటని ఏర్పాటు చేసుకుని పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క ఆకులని కూడా పూజలలో భాగంగానే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కకి ఏదైనా సమస్య వచ్చినా.. ఆ ఇంట్లో ఏదో ఉపద్రవం రాబోతోందని భావిస్తారు.

basil 2

తులసి కోట నారాయణ రూపం అయితే.. తులసి మొక్క లక్ష్మి దేవి రూపం అన్న సంగతి మరిచిపోకూడదు. అందుకే.. తులసి మొక్కని అపవిత్రం ట్రీట్ చేస్తే లక్ష్మి దేవి ఆగ్రహిస్తుందని పండితులు చెబుతుంటారు. తులసి మొక్కని ఎప్పుడు అందంగా ఉంచాలి. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తులసి మొక్క చుట్టూ చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి.

basil 3

అలాగే.. తులసి మొక్కకు దగ్గరలో చెప్పులను షూలను విడువకూడదు. అలాగే తులసి మొక్క చుట్టూ పక్కల ప్రాంతాలలో బకెట్ నిండా నీటిని నింపి ఉంచకూడదు. ఎందుకంటే నీరు నిండి ఉన్న బకెట్ నుంచి నెగటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ నెగటివ్ ఎనర్జీ తులసి మొక్కని చేరి ఆ ఇంటికి ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తులసి మొక్క చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.


End of Article

You may also like