Ads
ప్రస్తుతం భారత్ సౌతాఫ్రికాతో T20 సిరీస్ ఆడుతుంది. ఆ సీరియస్ లో భాగంగా నిన్న జోహానస్ బర్గ్ లో మూడో టి20 జరిగింది. అయితే ఈ టి20 సిరీస్ లో ఓపెనర్ శుభమాన్ గిల్ పూర్ పెర్ఫార్మన్స్ ఫాన్స్ ను డిసప్పాయింట్ చేస్తుంది.
Video Advertisement
రెండో టి20 లో విఫలమైన గిల్ మూడో టి20 లో కూడా అదే తీరు కొనసాగించాడు. 6 బంతుల్లో 12 రన్స్ చేసి వెనుతిరిగాడు.
అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో గిల్ అవుట్ అయిన తీరు పైన అసంతృప్తి నెలకొంది. కేశవ మహారాజ్ వేసిన బంతిని గిల్ స్వీప్ ఆడదామని ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. తీర బంతి ప్యాడ్లను తాకింది.బౌలర్ ఆపిల్ చేయగా అంపైర్ LBWగా ప్రకటించాడు. అయితే ఎంపైర్ నిర్ణయం పైన క్రీస్ లో ఉన్న గిల్ తో పాటు యశస్వి జైస్వాల్ చాలాసేపు మాట్లాడుకున్నారు కానీ రివ్యూ అయితే తీసుకోలేదు.
Shubman Gill was not-out but he didn't take the review. pic.twitter.com/WRLIuA2BiA
— Johns. (@CricCrazyJohns) December 14, 2023
గిల్ అవుట్ గా వెను తిరిగి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. అయితే తర్వాత రివ్యూ లో చూడగా బంతి లెగ్ స్టంప్స్ ను తాకకుండా వెళ్ళిపోయింది. ఒకవేళ గిల్ DRS కోరుకుంటే అది నాటౌట్ గా వచ్చి సర్వైవ్ అయ్యేవాడు. గిల్ రివ్యూ కోరుకోకపోవడంతో కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఫ్రష్టేట్ అయ్యాడు. ఆ రీయాక్షన్ కెమెరాలో కూడా కనిపించింది. కాకపోతే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సిరీస్ ని సమం చేసింది
End of Article