Ads
తెలుగు బుల్లితెర పైన ఎంతోమంది నటీమణులు తమ నటన కౌసల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలామంది నటనతో ఆ సీరియల్ కి క్రేజ్ తీసుకొస్తారు. కొందరు నటుల వల్లే ఆ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ కూడా వస్తుంది. అలా తెలుగులో చాలామంది నటీమణులు ఒకప్పుడు సక్సెస్ఫుల్ గా నటించి తర్వాత కనుమరుగైపోయారు. అలాంటివారి లిస్టును ఒకసారి పరిశీలిస్తే…
Video Advertisement
1. ప్రీతి అమిన్:
తెలుగులో చక్రవాకం సీరియల్ ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా చేసిన ప్రితి అమిన్ తెలుగు వారందరికీ ఫేవరెట్ అయిపోయింది. తర్వాత అలౌకిక, నాన్న అనే సీరియల్స్ లో నటించింది. కొన్ని రోజులకి అమెరికాకు చెందిన సైకియాట్రిస్ట్ ని వివాహం చేసుకొని సీరియల్స్ కి దూరమైంది.
2. గాయత్రీ:
ఓం నమః శివాయ భక్తి కార్యక్రమంలో పార్వతీ దేవిక గాయత్రీ ఇమిడిపోయి నటించేది. తర్వాత పవిత్ర బంధం, మెట్టెల సవ్వడి, కళ్యాణి, దేవత మొదలుకొని సీరియల్స్ నటించి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు యాక్టింగ్ కి దూరంగా జీవిస్తుంది.
3.ఉత్తర:
లేడీ డిటెక్టివ్ షోలో లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్ సాంగులో ఉత్తర పెర్ఫార్మెన్స్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత కొన్ని సినిమాల్లోనూ, సీరియల్స్ లో నటించిన ఉత్తర బుల్లితెరకు దూరమైంది.
4.రూపా దేవి:
ఋతురాగాలు సీరియల్లో కావేరిగా గుర్తుండిపోయే పాత్ర చేసింది రూపా దేవి. తర్వాత కొన్ని సీరియల్స్, సినిమాలు, టీవీ షోలు చేసిన రూపా దేవి ఎక్కువ కాలం నటనలో కొనసాగలేదు.
5.అశ్విని నంబియర్:
కళంకిత సీరియల్ తో తెలుగు వారికి బాగా దగ్గర అయింది ఈ మలయాళం నటి అశ్విని నంబియర్. తర్వాత అంతరంగాలు సీరియల్ లో కూడా నటించింది. క్రమంగా నటనకు దూరమైంది.
6. అనుపమ:
ఆట కావాలా పాట కావాలా, కొత్త సినిమా గురు షోస్ అనగానే వెంటనే గుర్తొచ్చే యాంకర్ అనుపమ. అప్పట్లో ఈ షో కి మంచి క్రేజ్ ఉండేది. తర్వాత అనుపమ కొన్ని రోజులకి టీవీ ఇండస్ట్రీకి దూరమైంది.
7.రజిని:
విజే నుండి యాక్టర్ గా మారిన రజిని తర్వాత కొన్ని సినిమాలు సీరియల్స్ లో నటించింది.యూత్ లో రజినీకి మంచి క్రేజ్ ఉండేది. కితకితలు సినిమాలో అల్లరి నరేష్ చెల్లెలుగా కూడా నటించింది.
8. జయతి:
యాంకర్ గా జయతి ఎందరికో ఫేవరెట్. తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పాపులారిటీ సంపాదించుకుంది. 2016లో ఒక సినిమా నిర్మాణం కూడా చేపట్టింది. తర్వాత మొత్తం నటనకే దూరమైంది.
9.జాహ్నవి:
డాన్స్ బేబీ డాన్స్ షో తో బాగా ఫేమస్ అయిన యాంకర్ జాహ్నవి. తర్వాత యజ్ఞం, రణం వంటి సినిమాలో మంచి మంచి క్యారెక్టర్లు చేసింది ఇప్పుడు యాక్టింగ్ కి దూరంగా ఉంటుంది.
Also Read:ఈ నిర్మాత చెప్పిన దాంట్లో తప్పు ఏం ఉంది..? ఇంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి..?
End of Article