ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 కోసం టీం ఇండియా జట్టును బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మ మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కలిసి మీడియా సమావేశంలో 15 మందితో కూడిన టీమ్ వివరాలను వెల్లడించాడు.

Video Advertisement

అజిత్ అగార్కర్ మాట్లాడుతూ ఆసియాకప్ 2023 టోర్నీ కోసం సెలెక్ట్ చేసిన జట్టులో ఇద్దరు ఆటగాళ్లను తప్ప మిగతా వారిని కొనసాగించామని వెల్లడించారు. అయితే ప్రపంచ కప్ జట్టు విషయంలో సెలక్టర్ల నిర్ణయం దుమారం సృష్టించింది. మాజీ క్రికెటర్ల నుండి క్రికెట్ ఫ్యాన్స్ వరకు తప్పు పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అందరు ఊహించినట్లుగానే యంగ్ ప్లేయర్స్ అయిన పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ, హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌ వర్మకు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కలేదు. వారికి మాత్రమే కాకుండా సంజూ శాంసన్‌కు, స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు  రవిచంద్రన్ అశ్విన్‌ లకు కూడా వరల్డ్‌కప్‌ ఆడేందుకు అవకాశం దొరకలేదు.
ప్రకటించిన జట్టే ఫైనల్‌ అని, ఒకవేళ గాయాల బెడద ఉంటే మార్పులు ఉండవచ్చని, లేదంటే ఎలాంటి మార్పులు ఉండవని భారత చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టంగా తెలిపారు. అన్ని వైపులా నుండి బాగా ఆలోచించిన తరువాతే ఈ పదిహేను మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ కప్ అక్టోబరు 5 నుంచి ఇండియా వేదికగా జరుగనుంది. అయితే సెలక్టర్ల తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ క్రికెటర్ల నుండి క్రికెట్ ఫ్యాన్స్ వరకు ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తొలగించడాన్ని తప్పుబట్టాడు. భారత జట్టు  మ్యాచ్ విన్నర్‌ను వరల్డ్ కప్ నుండి పక్కనపెట్టిందంటూ ట్వీట్ చేశారు. చాహల్‌ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కొందరు నెటిజెన్లు కేఎల్ రాహుల్ ను ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు.  రాహుల్ ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్‌లో లేని రాహుల్ ను ఎలా ప్రపంచ కప్ కు ఎంపిక చేశారని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: భారత్, పాకిస్తాన్ ఈ 2 జట్ల తరపున ఆడిన క్రికెటర్లు ఎవరో తెలుసా..?