మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని తండ్రి ఆశపడ్డాడు… కానీ క్రికెట్ మీద ఇష్టమే ఇంత దాకా తీసుకొచ్చింది..!

మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని తండ్రి ఆశపడ్డాడు… కానీ క్రికెట్ మీద ఇష్టమే ఇంత దాకా తీసుకొచ్చింది..!

by Megha Varna

Ads

ఎంతో కష్టపడి వ్యాపారం చేసుకుంటూ కొడుకుని బాగా చదివించాలని.. ఇంజినీర్ చెయ్యాలని అనుకున్నాడు. తన కొడుకు మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డాడు తండ్రి. పేద కుటుంబం అవ్వడంతో కొడుకు మీదే ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ కొడుకుకి మాత్రం చదువు కంటే కూడా క్రికెట్ అంటేనే ఇష్టం.

Video Advertisement

చదువుకోమని తండ్రి చెప్తే తాను మాత్రం మైదానంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఐపీఎల్ వేలంలో ఎంపికయ్యాడు.

దీంతో తండ్రి ఆనందానికి అవధులు లేవు. అయితే మరి ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… శుభమ్ గరేవాల్ రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి దగ్గరలో ఒక గ్రామంలో ఉండేవాడు. తన తండ్రి ఒక కిరాణా షాపు నడిపే వాడు. అయితే కొడుకుని ఇంజనీరింగ్ చేయాలని కలలు కన్నాడు తండ్రి. కానీ శుభమ్ గరేవాల్ కి మాత్రం క్రికెట్ అంటే ఇష్టం.

ఇప్పుడు ఆ ఇష్టమే తనని ఆర్ఆర్ టీం కి ఎంపిక అయ్యేలా చేసింది. ఇటీవల జరిగిన వేలంలో 20 లక్షల రూపాయలకు ఎంపికయ్యాడు శుభమ్. దీంతో తండ్రి ఎంతో ఆనందంతో నిండి పోయాడు. అప్పు చేసి మరీ కొడుకుని ఢిల్లీలో కోచింగ్ కి పంపించాడు. రాజస్థాన్ రంజీ టీమ్ లో సభ్యుడు అయినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.

వయసు పెరిగిపోతోంది… కుటుంబ బాధ్యతలు కూడా తన మీద పడుతున్నాయి.. అయినప్పటికీ క్రికెట్ మీద ఇష్టంతో వదులుకోలేదు. ఆఖరికి ఈసారి 20 లక్షలు వెచ్చించి తనని కొనుక్కున్నారు. ఇండియా టీం లో ప్లేస్ ని సంపాదించుకోవడమే తన లక్ష్యం అని చెప్పాడు శుభమ్. మరి శుభమ్ ఐపీఎల్ టీం లో బాగా ప్రదర్శించాలని కోరుకుందాం.


End of Article

You may also like