బ్లాక్ చైన్ వెడ్డింగ్ ద్వారా ఒక్కరైన తొలి జంట వీరే.. అసలు బ్లాక్ చైన్ వెడ్డింగ్ అంటే ఏంటి..?

బ్లాక్ చైన్ వెడ్డింగ్ ద్వారా ఒక్కరైన తొలి జంట వీరే.. అసలు బ్లాక్ చైన్ వెడ్డింగ్ అంటే ఏంటి..?

by Megha Varna

Ads

తాజాగా ఒక జంట బ్లాక్ చైన్ వెడ్డింగ్ చేసుకోవడం వైరల్ గా మారింది. పూణేకి చెందిన అనిల్ నర్సిపురం, శృతి నాయర్ ఇద్దరు కూడా బ్లాక్ చైన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే మన ఇండియాలో ఇలాంటి పెళ్లి ఇదే మొదటిసారి. మొత్తం పెళ్లి అంతా కూడా డిజిటల్‌మయంగా ఇండియాలో జరిగింది.

Video Advertisement

ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీనితో వీళ్ళు 2021 నవంబరు 15న రిజిస్ట్రర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తరవాత పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలని డిజిటల్ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో ఈథెరమ్‌ స్మార్ట్‌ కాంట్రాక్టు పద్దతిని అనుసరించి ఓపెన్‌ సీ ఫ్లాట్‌ఫామ్‌లో వీళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది.  ఇక ఈ పెళ్లి ఎలా జరిగింది అనేది చూస్తే.. శృతి చేతికి పెట్టుకున్న ఎంగేజ్‌మెంట్‌రింగ్ యొక్క ఫోటోను నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌గా మార్చారు. నెక్స్ట్ ఏమో ఈ ఎన్‌ఎఫ్‌టీని అనిల్‌కి బ్లాక్‌ చెయిన్‌లో సెండ్ చేసారు. దీనిని అనిల్‌ రిసీవ్‌ చేసుకోవడంతో పెళ్లి ముగిసింది. దీనికి కేవలం పదిహేను నిముషాలు పట్టింది.

రెండు ల్యాప్‌ట్యాప్‌లు, ఓ డిజిటల్‌ పురోహితుడు కూడా ఈ పెళ్ళికి అవసరం అయ్యాయి. మేము ఒకరికొకరం తోడుగా ఉండాలని అనుకున్నాం. అలానే కలిసి జీవించాలని అనుకున్నాం. పెద్దల్ని ఇలా పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పించి మేము పెళ్లి చేసుకున్నాం అని నూతన దంపతులు తెలిపారు.

ఇక బ్లాక్ చైన్ ద్వారా పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి అనే విషయానికి వస్తే… డిజిటల్ లెడ్జర్‌లో స్టోర్ చేసిన డేటా ని ఎన్ఎఫ్‌టీ అంటారు. అయితే ఈ పద్ధతినే బ్లాక్‌చెయిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, ఆడియో, ఇతర డిజిటల్ ఫైల్స్‌తో ఎన్ఎఫ్‌టీలని చెయ్యచ్చు. దీనిని ప్రతీ ఏడాది మార్చడానికి, రద్దు చెయ్యడానికి కూడా అవుతుంది. చట్ట పరంగా దీనికి అంత విలువ అయితే లేదు. అయితే ఇది కూడా మంచి ఎంపికే ఎందుకంటే ఒకరు ఎప్పటికీ బ్లాక్‌చెయిన్‌లో ఉంటారు.


End of Article

You may also like