Ads
క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్. దీంట్లో క్రమశిక్షణ చాలా అవసరం. ఇక బౌలర్లకైతే అది తప్పనిసరి. క్కువ వికెట్లు రాబట్టాలంటే చక్కని లైన్ అండ్ లెంగ్త్ ఉండాల్సిందే. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా బంతి గతితప్పి వైడ్ గానో, నోబ్ గానో వెళ్తుంది. దాని వల్ల ఎక్స్ట్రా రన్స్ లోకూడా వస్తాయి. ఒక్కోసారి రన్ అప్ సరిగా లేకపోవడం పిచ్ లైన్ దారి వేయడం వల్ల లైన్ నోబాల్ అవుతుంది. దీని ద్వారా కూడా ఎక్స్ట్రా రన్ వస్తాయి. దీనికి అవుట్ ఉండదు. కేవలం రన్ అవుట్ మాత్రమే ఉంటుంది. ఈ మధ్య ఈ లైన్ నోబ్ లకు ఫ్రీ హిట్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల బౌలర్లకు ఇంకా తలనొప్పి ఎక్కువయ్యింది. కానీ ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకు నో బాల్ వేయని బౌలర్లు ఉన్నారన్న విషయం మీకు తెలుసా? వాళ్లెవరో ఒక లుక్ వేద్దాం మరి?
Video Advertisement
లాన్స్ గిబ్స్:
వెస్టిండిస్ స్పిన్నర్ .. 79 టెస్ట్ లు , 3 ODIs లు ఆడిన గిబ్స్ ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 300 వికెట్స్ ఫాస్ట్ గా తీసిన బౌలర్ కూడా ఇతనే.!
Lance Gibbs
ఇయాన్ బోథమ్
ఇంగ్లాడ్ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బోథమ్… 102 టెస్ట్ లు 116 ODIs ఆడాడు. ఒక్కటంటే ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
Ian Botham
ఇమ్రాన్ ఖాన్.
175 ODIs 88 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక్క నో బాల్ వేయలేదు.! ఈయన కూడా ఫాస్ట్ బౌలరే.!
Imran Khan
డెన్నిస్ లిల్లీ..
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ… 70 టెస్ట్ 63 ODI లు ఆడాడు… సింగిల్ నో బాల్ కూడా వేయలేదు
Dennis Lillee
కపిల్ దేవ్.
ఇండియాకు మొదటి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన కెప్టెన్.. కపిల్ దేవ్.. 131 టెస్ట్ 225 ODIs ఆడాడు. ఈయన కూడా ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
Kapil Dev
End of Article