హై ఫ్లేమ్ లో పెట్టినా మంట రావట్లేదా..? ఈ చిన్న ట్రిక్ తో ఈజీ గా కొత్త గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ లా మార్చేయండి..!

హై ఫ్లేమ్ లో పెట్టినా మంట రావట్లేదా..? ఈ చిన్న ట్రిక్ తో ఈజీ గా కొత్త గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ లా మార్చేయండి..!

by Anudeep

Ads

రోజు వాడే వస్తువులకు ఒక్కొక్కసారి రిపేర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యం గా గ్యాస్ స్టవ్ లాంటి వస్తువులు కొన్నేళ్ల తరువాత గతం లో లాగా పనిచేయవు. అలాంటప్పుడు వీటిని మనం బయట షాప్స్ లో రిపేర్ చేయించుకుంటూ ఉంటాం. అయితే.. కొన్ని కొన్ని చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే.. ఈ రిపేర్ లను మనమే చేసుకోవచ్చు. ఎంచక్కా సమయాన్ని, మనీని ఆదా చేసుకోవచ్చు.

Video Advertisement

gas stove 1

ఇంతకీ ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికంటే ముందు గ్యాస్ స్టవ్ వాడిన కొన్నేళ్ళకి మంట ఎందుకు తగ్గిపోతుందో మనకి తెలియాలి. ఎక్కువ రోజులు వాడడం వలన గ్యాస్ స్టవ్ అడుగు భాగం లో గ్యాస్ వచ్చే పైప్ లోపల దుమ్ము, ధూళి వంటివి చేరతాయి. ఇవి గ్యాస్ ని బర్నర్ దిశగా వచ్చే సమయం లో అడ్డుకుంటూ ఉంటాయి. అందువల్లనే మంట తగ్గిపోతూ ఉంటుంది.

gas stove 2

దీనిని మనం సరి చేస్తే కొత్త గ్యాస్ స్టవ్ ల లాగా ఫ్లేమ్ ఎక్కువ గా వస్తుంది. ముందు మీ గ్యాస్ బండ కి ఉన్న రెగ్యూలేటర్ ని ఆఫ్ చేయాలి. ఆ తరువాత అన్ని బర్నర్ లు ఆఫ్ లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకుంటే, ఆఫ్ చేయాలి. గ్యాస్ స్టవ్ పై ఉన్న ప్లేట్స్, స్టాండ్స్ అన్నిటిని తొలగించాలి. ఆ తరువాత గ్యాస్ స్టవ్ ను బోర్లించి పెట్టాలి. బర్నర్ కింద ఉండే నట్లను కటింగ్ ప్లేయర్ సాయం తో తిప్పాలి. అవి గట్టి గా ఉండి రాకపోతే.. కొంచం ఆయిల్ వేయండి.

gas stove 3

ఆయిల్ వేసిన తరువాత లూస్ అయ్యి వచ్చేస్తాయి. అవి వచ్చేసాక బర్నర్లను పూర్తి గా తీసేయాలి. అప్పుడు బర్నర్ అటాచ్ చేయబడిన పైప్ కనిపిస్తుంది కదా.. ఆ పైప్ కు సన్నని రంధ్రం ఉంటుంది. పిన్నీసు సాయం తో ఆ రంధ్రం లో ఉన్న డస్ట్ ను శుభ్రం చేయండి. ఐతే, ఇది శుభ్రం చేసేటపుడు సున్నితం గా చేయాలి.. లేదంటే పిన్నీసు గాని, సూది గాని ఆ రంధ్రం లో ఇరుక్కుని విరిగిపోతే మొత్తం స్టవ్ అంతా విప్పాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త గా చేయాలి.

gas stove 4

ఒకదాని తరువాత మరొక స్టవ్ ని కూడా అలాగే శుభ్రం చేయండి. ఆ తరువాత తిరిగి బర్నర్ ను యధాస్థానం లో బిగించాలి. మళ్ళీ స్టవ్ ను మాములుగా పెట్టేసి, స్టాండ్స్, ప్లేట్స్ ను కూడా ఎక్కడివి అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు రెగ్యూలేటర్ ను ఆన్ చేసి, స్టవ్ ఆన్ చేయండి. గతం లో కంటే ఎక్కువ మంట తో స్టవ్ మండుతూ కనిపిస్తుంది.

Watch Video:


End of Article

You may also like