ఫోన్, లాప్టాప్ స్క్రీన్స్ వల్ల కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి..!

ఫోన్, లాప్టాప్ స్క్రీన్స్ వల్ల కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి..!

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో మనం కూడా మొబైల్ ఫోన్స్ కి ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి అలవాటు పడిపోయాం. నిజానికి కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ స్క్రీన్ల వల్ల మన కళ్ళను మనమే ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాము.

Video Advertisement

కాలక్షేపం కోసం ఫోన్, టీవీని ఎక్కువగా వాడుతూ కంటికి రెస్ట్ లేకుండా చేస్తున్నాం పైగా పిల్లల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ దూరమవుతోంది. అయితే ఎక్కువ సేపు వీటి ముందు గడపడం వల్ల ఎలాంటి లాభ, నష్టాలు ఉంటాయి..?, ఎలా మనం వీటికి దూరంగా ఉంటే మంచిది అనే వాటి గురించి చూద్దాం.

నిజానికి వీటి వల్ల మనకి కాలక్షేపం అవుతుంది. అలానే ఎక్కువ శ్రమ పడకుండా ఎన్నో విషయాలను నేర్చుకోగలరు. పైగా దూరంగా ఉన్న వాళ్ళతో వీడియో కాల్స్ వంటివి మాట్లాడుకుని దగ్గరగా ఉండొచ్చు. అయితే ప్రతిదానిలోనూ నష్టాలు ఉన్నట్లే దీనిలో కూడా నష్టాలు ఉన్నాయి.

ఎక్కువ స్క్రీన్ చూడటం వల్ల కంటికి ఎఫెక్ట్ అవుతుంది.
చాలా మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వలన బాధపడుతున్నారు.
దీని వల్ల తలనొప్పి, కళ్ళు నొప్పులు, కళ్ళు మంటలు, మసకబారడం, మెడనొప్పి, నడుంనొప్పి, అలసట వంటివి కలుగుతాయి.
కంటి చూపు కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.
పిల్లలకైతే ప్రవర్తనలో తేడాలు వస్తాయి. రంగులు గుర్తించే శక్తి కూడా తగ్గిపోతుంది.
అలానే ఫోన్లు అలవాటు చేస్తే పిల్లలకి మాటలు రావడం ఆలస్యం అవుతుంది.

స్క్రీన్స్ వలన సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి:

పెద్ద స్క్రీన్ ఎంచుకోండి. మీకు ఆన్లైన్ క్లాసులు వంటి ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు పెద్ద స్క్రీన్ ని ఎంచుకోండి. ఎంత పెద్ద స్క్రీన్ అయితే అంత ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే వాటికి దూరంగా ఉండండి.
అదేవిధంగా స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. పైగా బయట వెలుతురు కూడా మీకు బాగుండేలా చూసుకోండి.
ఎక్కువ సేపు అదే పనిగా చూడటం కంటే కూడా మీరు కంటిరెప్పల వేస్తూ ఉండండి.
గంటలకొద్దీ స్క్రీన్ చూడకుండా 20 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇవ్వడం.. లేచి నడవడం లాంటివి చేయండి.


మీరు వేసుకునే కుర్చీ, టేబుల్ కూడా తగిన హైట్ లో ఉండేటట్లు చూసుకోండి.
ఎక్కువ నీళ్లు తాగితే మంచిది. ఎక్కువ నీళ్లు తాగితే కంటి ఆరోగ్యం బాగుంటుంది.
అలానే కంటి ఆరోగ్యం బాగుండాలంటే పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోండి.
విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.
ఆరు నెలలకు ఒకసారి కళ్ల డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఆన్లైన్ క్లాసులు లేదా ముఖ్యమైన పనులు అయిపోయిన తర్వాత గ్యాడ్జెట్స్ ని పక్కన పెట్టేయండి.


End of Article

You may also like