Ads
ప్రేమకి ప్రాంతం, భాష, ఇంకా మిగిలిన వాటితో సంబంధం లేదు అని అంటారు. అది నిజం అని చాలా మంది నిరూపించారు కూడా. అలా వేరే దేశానికి చెందిన కొంత మంది క్రికెటర్లు మన ఇండియన్స్ ని ప్రేమించారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 గ్లెన్ టర్నర్ – సుఖీందర్ కౌర్ గిల్
న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ టర్నర్, 1973 లో సుఖీందర్ కౌర్ గిల్ ని పెళ్లి చేసుకున్నారు. సుఖీందర్ కౌర్ గిల్, లుధియానాలో పుట్టారు. తర్వాత చదువుకోడానికి యునైటెడ్ స్టేట్స్ కి వెళ్లారు.
#2 జహీర్ అబ్బాస్ – రీటా లుత్రా
జహీర్ అబ్బాస్, ఇండియాకి చెందిన రీటా లుత్రా ని పెళ్లి చేసుకున్నారు.
#3 షోయబ్ మాలిక్ – సానియా మీర్జా
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, 2010 లో సానియా మీర్జా ని పెళ్లి చేసుకున్నారు.
#4 మైక్ బ్రేర్లీ – మన సారాభాయి
మైక్ బ్రేర్లీ, భారతదేశానికి చెందిన మన సారాభాయ్ ని పెళ్లి చేసుకున్నారు.
#5 ముత్తయ్య మురళీధరన్ – మదిమలార్ రామమూర్తి
ముత్తయ్య మురళీధరన్, 2005లో చెన్నైకి చెందిన మదిమలార్ రామమూర్తి ని పెళ్లి చేసుకున్నారు.
#6 షాన్ టైట్ – మాషూమ్ సింఘా
మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షాన్ టైట్, 2014 లో మాషూమ్ సింఘా ని పెళ్లి చేసుకున్నారు.
#7 మొహసిన్ ఖాన్ – రీనా రాయ్
మొహసిన్ ఖాన్, నటి రీనా రాయ్ ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు.
#8 వివియన్ రిచర్డ్స్ – నీనా గుప్తా
వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తా రిలేషన్ షిప్ లో ఉన్నారు. తర్వాత వారిద్దరూ విడిపోయారు. వీరిద్దరు కూతురు అయిన మసాబా గుప్తా ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. ఎంతో మంది సెలబ్రిటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అలాగే హౌస్ ఆఫ్ మసాబా పేరుతో సొంత బ్రాండ్ కూడా నెలకొల్పారు.
#9 హసన్ అలీ – షమియా ఆర్జూ
పాకిస్థానీ క్రికెటర్ హసన్ అలీ, ఇండియన్ నేషనాలిటీకి చెందిన షమియా ఆర్జూ ని గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు.
#10 ఇమ్రాన్ తాహిర్ – సుమయ్యా దిల్దార్
ఇమ్రాన్ తాహిర్, 2007 లో ఇండియన్ ఒరిజిన్ కి చెందిన సౌత్ ఆఫ్రికన్ అయిన సుమయ్యా దిల్దార్ ని పెళ్లి చేసుకున్నారు.
#11 గ్లెన్ మాక్స్ వెల్ – వినీ రామన్
ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్, మెల్బోర్న్ లో నివసించే ఫార్మసిస్ట్ వినీ రామన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ జరిగింది.
End of Article