Ads
తాజాగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఒక ప్లేయర్ ను వదిలేసింది. తర్వాత ఆ ప్లేయర్ ను ఏ ఐపిఎల్ టీం కొనుగోలు చేయలేదు. అయితే ఆ ప్లేయర్ ఇప్పుడు జరుగుతున్న రంజి టోర్నీ లో దుమ్ము రేపుతున్నాడు.
Video Advertisement
ఏకంగా డబల్ సెంచరీలు చేసి కోహ్లీ రికార్డును సమానం చేశాడు. ఇంతకీ ఎవరు ఆ ప్లేయర్? ఏంటి అతని కథ అనేది చూద్దాం…?
తమిళనాడు కు చెందిన వికెట్ కీపర్ నారాయణ్ జదీషన్ తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించి అందరిని ఆశ్చర్య పరిచాడు. చంఢీగడ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేసి 23 ఫోర్లు, 5 సిక్సర్లతో 321 పరుగులు చేశాడు దీంతో తమిళనాడు తమ ఫస్ట్ ఇన్నింగ్స్ ను 610/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇది జగదీషన్ కు వరుసగా రెండో డబుల్ సెంచరీ. ఇటీవలే రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో సైతం 245 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అరుదైన రికార్డు సాధించిన బ్యాటర్ల జాబితాలోకి ఎక్కాడు ఈ యువ క్రికెటర్.
ఇక రంజీ క్రికెట్ చరిత్రలో వరుసగా డబల్ సెంచరీ సాధించిన 18వ ఇండియన్ ప్లేయర్ గా రికార్డు లోకి ఎక్కాడు. ఈ సందర్భంగానే కింగ్ కోహ్లీ రికార్డును కూడా సమానం చేశాడు గతంలో కోహ్లీ కూడా రంజీలలో వరుసగా డబల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.గతంలో కేకేఆర్ తరఫున 6 మ్యాచ్ ల్లో 89 రన్స్ చేశాడు జగదీషన్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు ఇతని పెర్ఫార్మన్స్ చూసిన ఎవరైనా సరే కేకేఆర్ ఇతని వదులుకొని తప్పు చేసిందని అంటున్నారు.
End of Article