Ads
ఇటీవల మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 175 పరుగులు చేశారు. దాంతో జడేజాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ జడేజాపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Video Advertisement
గౌతమ్ గంభీర్ ఈ విషయంపై మాట్లాడుతూ, “జడేజా ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ అంత గొప్పది ఏమీ కాదు” అని చెప్పారు. “కేవలం గణాంకాలను చూసి ఆ ఇన్నింగ్స్ ని గొప్ప ఇన్నింగ్స్ గా భావిస్తున్నారు” అని చెప్పారు. “ఇదే ఇన్నింగ్స్ విదేశాల్లో ఆడి ఉంటే ఆత్మవిశ్వాసం మరింత పెరిగేది” అని అన్నారు.
“సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత డిసిల్వా, అసలంక, ఎంబూల్దేనియా బౌలింగ్‌లో జడేజా మరింత బాగా ఆడారు” అని అన్నారు. “ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ లో కానీ జడేజా ఏడవ స్థానంలో వచ్చి 40, 50 పరుగులు చేసినా కూడా అది ఇంతకంటే మంచి ఇన్నింగ్స్ గా పరిగణించవచ్చు” అని అన్నారు. “రవీంద్ర జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. టీ20ల్లో బౌలర్‌గా వికెట్లు తీయడం మాత్రమే కాకుండా, బ్యాటర్‌గా హిట్టింగ్ కూడా చేయగలరు” అని అన్నారు.
“కానీ శ్రీలంకపై ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అత్యుత్తమమైనది కాదు” అని అభిప్రాయపడ్డారు గౌతమ్ గంభీర్. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే, బ్యాటింగ్‌లో అజేయంగా 175 పరుగులు చేయడంతోపాటు, బౌలింగ్‌లో కూడా 9 వికెట్లు తీశారు రవీంద్ర జడేజా. దాంతో జడేజాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీం ఇండియా 574-8 చేయగా, శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 174, సెకండ్ ఇన్నింగ్స్ లో 178 పరుగులు చేసింది.
End of Article