IPL AUCTION 2024: 43 బాల్స్‌లో 193 పరుగులు… ఐపీఎల్ ఆక్షన్ లో అన్ని టీంలు ఇతనిపై కన్నేస్తారా.? ఇతను ఎవరంటే.?

IPL AUCTION 2024: 43 బాల్స్‌లో 193 పరుగులు… ఐపీఎల్ ఆక్షన్ లో అన్ని టీంలు ఇతనిపై కన్నేస్తారా.? ఇతను ఎవరంటే.?

by Mounika Singaluri

Ads

ఐపీఎల్ 2024 కి అంత సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీం లన్ని కూడా రిలీజ్ చేసిన ప్లేయర్లు, తమతో అంటిపెట్టుకున్న ప్లేయర్ల జాబితాలను ప్రకటించాయి. ఇంకా కొన్ని టీం అయితే క్యాష్ ట్రేడింగ్ ద్వారా ప్లేయర్లను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దుబాయ్ లో జరిగే మినీ వేలంలో వరల్డ్ కప్ లో ప్రతిభ చాటిన ప్లేయర్లను కొనేందుకు ప్రతి టీం దాదాపు ప్రయత్నిస్తుంది. అయితే తాజాగా యూరోపియన్ టీ10 లీగ్‌లో ఓ బ్యాట్స్ మెన్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు.కేవలం 43 బాల్స్‌లో దాదాపు డబుల్ సెంచరీ చేసినంత పని చేశాడు.

Video Advertisement

కాటలున్యా జాగ్వార్ టీం తరపున ఆడుతున్న హంజా సలీమ్ దార్ ప్రతి బాల్‌ను బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 43 బాల్స్‌లో 193 పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ10 మ్యాచ్‌ లలో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.టీ20ల్లో కూడా ఈ స్థాయిలో వ్యక్తిగత స్కోరు నమోదు కాలేదు. ఇప్పటివరకు టీ10 క్రికెట్‌లో అత్యధిక స్కోరుగా ఉన్న 163 పరుగుల రికార్డును హంజా సలీమ్ దార్ బ్రేక్ చేశాడు.

కాగా డిసెంబర్ 5న జరిగిన మ్యాచ్ లో సోహల్ హాస్పటల్టెట్ జట్టుపై అతడు స్కోరు చేసిన 193 పరుగుల్లో 22 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. 43 బాల్స్‌లో 36 బాల్స్‌ను బౌండరీలకు తరలించడం విశేషం.బౌలింగ్‌లోనూ హంజా సలీమ్ దార్ మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రికార్డు సృష్టించిన ప్లేయర్ పైన ఐపీఎల్ టీమ్ లు దృష్టి సారిస్తాయేమో చూడాలి. ఎందుకంటే పొట్టి ఫార్మేట్ లలో ఇలా దూకుడుగా ఆడే ప్లేయర్లే కావాలి కాబట్టి.


End of Article

You may also like