టోల్ కట్టడానికి కోపమొచ్చి ఆ ఊరి వాళ్ళు ఏం చేసారో తెలుసా.? ఏకంగా జేసీబీ తో.?

టోల్ కట్టడానికి కోపమొచ్చి ఆ ఊరి వాళ్ళు ఏం చేసారో తెలుసా.? ఏకంగా జేసీబీ తో.?

by Mohana Priya

Ads

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఒక ఘటన ప్రస్తుతం చర్చల్లో ఉంది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హెజమాడి గ్రామస్తులు మంగళూరు టు ఉడిపి హైవే మీద టోల్ బూత్ పక్కనే ఒక రోడ్డు నిర్మించారు. ఫాస్టాగ్ అందరికీ కంపల్సరీ చేసిన తర్వాత ఆ గ్రామస్తులకు అలాగే టోల్ కంపెనీలకి ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. గ్రామస్తులు టోల్ ఫ్రీ సర్వీస్ రోడ్స్ ని కల్పించమని డిమాండ్ చేశారు.

Video Advertisement

Hejamadi toll plaza

కానీ చాలా రోడ్ల కి ఇది ఇది సాధ్యం అవ్వలేదు. దాంతో ఆ గ్రామస్తులు వేరే రోడ్డు నిర్మించారు. ఆ గ్రామం నుండి ప్రయాణికులను తీసుకువెళ్లే నాలుగు బస్సులకు రాయితీ రాలేదు. ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఆ గ్రామ పంచాయితీ బస్సులకు రాయితీ ఇచ్చింది. వాస్తవానికి ఆ గ్రామం నుండి ప్రయాణికులను తీసుకెళ్ళడానికి వచ్చే బస్సులకు రాయితీ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Hejamadi toll plaza

కానీ అది జరగలేదు. దాంతో విసిగిపోయిన గ్రామపంచాయతీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చి టోల్ ప్లాజా ను తొలగించాలని నిర్ణయించింది. దాంతో గ్రామస్తులు ఒక జెసిబి ని అద్దెకు తీసుకుని టోల్ బూత్ లను దాటి వేయడానికి తాత్కాలిక దానిని నిర్మించారు. అలా మెయిన్ రోడ్డు పక్కన మరొక రోడ్ వచ్చింది. ఈ వార్తను తెలుసుకున్న తర్వాత అధికారులు ఆ స్థలానికి వచ్చారు.

Hejamadi toll plaza

అయినా సరే ఆ గ్రామస్తులు నిరసనను వ్యక్తం చేస్తూ కొత్త రోడ్డు నిర్మించారు. తమ డిమాండ్లను అధికారులు పరిష్కరించాలని గ్రామస్తులు అడిగారు. గ్రామస్తులకు అలాగే అధికారులకు మధ్య చర్చ జరిగిన తర్వాత భవిష్యత్తులో బస్సులకు రాయితీ ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు అధికారులు. కానీ బస్సు లో ఇప్పటికే తాత్కాలికంగా నిర్మించిన రహదారులను ఉపయోగించడం ప్రారంభించాయి.


End of Article

You may also like