Home Sports Adda బ్యాట్ మీద ఆ కంపెనీ స్టికర్ వేసినందుకు…ఈ 6 క్రికెటర్స్ ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా.?

బ్యాట్ మీద ఆ కంపెనీ స్టికర్ వేసినందుకు…ఈ 6 క్రికెటర్స్ ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా.?

by Mohana Priya

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంక క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. అయితే, మ్యాచ్ సమయంలో మన క్రికెటర్లు కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తారు. అలా బ్యాట్ స్పాన్సర్ షిప్ కింద బ్రాండ్స్ ప్రమోట్ చేసే క్రికెటర్లలో ఏడాదికి ఎక్కువ మొత్తం తీసుకునే క్రికెటర్లు ఎవరో, వారు ప్రమోట్ చేసే బ్రాండ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 విరాట్ కోహ్లీ – 12.5 కోట్లు

విరాట్ కోహ్లీ ఎంఆర్ఎఫ్  బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారు. ప్రపంచం మొత్తంలోనే బ్యాట్ స్పాన్సర్ షిప్ పై ఎక్కువ మొత్తం తీసుకుంటున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ.

highest payed Indian cricketers for bat sponsorship

#2 మహేంద్ర సింగ్ ధోనీ – 4.33 కోట్లు

మహేంద్రసింగ్ ధోని స్పార్టన్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారు.

highest payed Indian cricketers for bat sponsorship

#3 యువరాజ్ సింగ్ – 4 కోట్లు

క్రికెటర్ యువరాజ్ సింగ్ పుమా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారు. అందుకు ఏడాదికి 4 కోట్ల మొత్తాన్ని తీసుకుంటారు.

highest payed Indian cricketers for bat sponsorship

#4 శిఖర్ ధావన్ – 3 కోట్లు

శిఖర్ ధావన్ 2013 నుంచి ఎంఆర్ఎఫ్ తో ఒప్పందం లో ఉన్నారు. ఎంఆర్ఎఫ్ బ్రాండ్ ప్రమోషన్ కి ఏడాదికి 3 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు.

highest payed Indian cricketers for bat sponsorship

#5 రోహిత్ శర్మ –  3 కోట్లు (మూడు సంవత్సరాలకు)

రోహిత్ శర్మ సియట్ టైర్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. రోహిత్ శర్మ సియట్ బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకు మూడు సంవత్సరాలకు 3 కోట్ల రూపాయలు స్పాన్సర్ షిప్ కింద అందుకుంటున్నారు.

highest payed Indian cricketers for bat sponsorship

#6 సురేష్ రైనా – 2.5 కోట్లు (మూడు సంవత్సరాలకు)

2015 లో సియట్ కంపెనీ సురేష్ రైనాతో మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. సియట్ బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకు మూడు సంవత్సరాలకు 2.5 కోట్ల రూపాయలు స్పాన్సర్ షిప్ కింద అందుకున్నారు.

highest payed Indian cricketers for bat sponsorship

You may also like