T20 వరల్డ్ కప్‌కి ముందు ICC 8 కొత్త రూల్స్… బౌలర్లకు లాభమేనా.?

T20 వరల్డ్ కప్‌కి ముందు ICC 8 కొత్త రూల్స్… బౌలర్లకు లాభమేనా.?

by Mohana Priya

Ads

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కి సంబంధించిన కొన్ని నియమాలని మార్చింది. ఈ నియమాలని మార్చాలి అని ఉమెన్ క్రికెట్ కమిటీకి కూడా పంపారు. వారు కూడా ఈ విషయానికి ఆమోదం తెలిపారు.

Video Advertisement

ఆటలో పాటించే కొన్ని పద్ధతులని మార్చాలి అని కమిటీ నిర్ణయించుకుంది. ఆ పద్ధతులు ఏంటో, వాటిని మార్చి కొత్తగా ఎలాంటి నియమాలని తీసుకురాబోతున్నారో ఇప్పుడు చూద్దాం.

icc new rules

#1 పిచ్ బయటికి వెళితే నో బాల్ గా పరిగణించబడుతుంది. బ్యాట్ లేదా బ్యాటర్ లోని కొంత భాగం కచ్చితంగా పిచ్ లోపల ఉండాలి. అలా కాకుండా పిచ్ బయటికి వెళితే అంపైర్ దానిని డెడ్ బాల్ గా పరిగణిస్తారు. బ్యాటర్ ఒక వేళ పిచ్ బయటికి వెళ్ళేలా బౌలింగ్ చేస్తే ఆ బాల్ ని నో బాల్ గా పరిగనిస్తారు

icc new rules

#2 ఉమ్ముతో బంతి రుద్దడం కూడా నిషేధించారు. సాధరణంగా బౌలింగ్ చేసే ముందు బౌలర్లు ఉమ్ముతో బాల్ రుద్దుతారు. కోవిడ్ కారణంగా ఇది గత రెండు సంవత్సరాల నుండి చెయ్యట్లేదు. ఇప్పుడు దీనిని శాశ్వతంగా నిషేధించాలి అని నిర్ణయించుకున్నారు.

icc new rules

#3 మన్‌కడింగ్‌ అంటే నాన్-స్ట్రైకింగ్ ఎండ్ లో ఉండే బ్యాటర్ క్రీజ్ దాటినపుడు బౌలింగ్ చేసే బౌలర్లు వికెట్లు పడేస్తే దాన్ని మన్‌కడింగ్‌ అంటారు. అంతకు ముందు ఈ విషయాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా చూసేవారు. ఇప్పుడు మాత్రం దీన్ని ఆటలో ఒక భాగంగానే పరిగణించాలి అనే నిర్ణయం తీసుకున్నారు.

icc new rules

#4 టెస్ట్ మ్యాచ్ లో, వన్డే మ్యాచ్ లో బ్యాటర్ రాగానే రెండు నిమిషాల్లో రెడీ అవ్వాలి. టీ 20 కి ఇది 90 సెకండ్లు అని నియమం పెట్టారు. అది మాత్రం ఇప్పుడు మార్చలేదు.

icc new rules

#5 బౌల్ చేయకముందే బ్యాటర్స్ క్రీజ్ దాటి బయటికి వస్తే బౌలర్ వికెట్లను బాలతో కొట్టి చేయొచ్చు. లేదా కీపర్ కి బాల్ అందించడం ద్వారా అవుట్ చేయొచ్చు. కానీ ఇప్పటి నుండి అలా కుదరదు. ఒకవేళ అలా చేస్తే డెడ్ బాల్ గా పరిగణిస్తారు.

icc new rules

#6 ఈ సంవత్సరం జనవరి టీ 20ల్లో ప్రవేశపెట్టిన ఇన్ మ్యాచ్ పెనాల్టీ ఇప్పటి నుంచి వన్డే మ్యాచ్ కి కూడా వర్తించేలా రూల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

icc new rules

#7 ఒక ప్లేయర్ క్యాచ్ అవుట్ అయితే కొత్తగా వచ్చే బ్యాటర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవుట్ అయిన బ్యాటర్ పరుగు తీస్తూ నాన్ స్ట్రైక్ ఎండ్ కి వెళ్ళినా కూడా ఇదే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

icc new rules

#8 బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు ఫీల్డింగ్ జట్టు సరిగ్గా ప్రవర్తించకపోతే ఆ బాల్ ని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. అదే కాకుండా అయిదు పరుగులని బ్యాటింగ్ జట్టుకి ఇస్తారు.

icc new rules

2023 లో జరిగే పురుషుల వరల్డ్ కప్ తర్వాత ఈ నిబంధనలు అమలు చేస్తారు.


End of Article

You may also like