శనివారం రోజు జరిగిన ఇంగ్లాండ్ – భారత మహిళల జట్టు క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. చివరి దాకా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 16 పరుగుల తేడాతో ఆతిధ్య ఇంగ్లాండ్ పై ఘన విజయాన్ని అందుకుంది. దీనితో మూడు మ్యాచ్ల సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 45 4 ఓవర్లలో 169 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్లో బాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 118 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. 17 పరుగులు చేసి ఇంగ్లాండ్ గెలవాల్సిన సమయంలో డీన్ ని దీప్తి శర్మ రన్ అవుట్ ( మాన్కడింగ్) చేశారు. భారత్ ఇనింగ్స్ లో దీప్తి శర్మ 28 పరుగులు, స్మృతి మంధానా 50 పరుగులు చేసారు. భారత పేస్ దిగ్గజం జులన్ గోస్వామి చివరి మ్యాచ్ కావడం విశేషం.

Video Advertisement