సౌత్ ఆఫ్రికాతో ఈరోజు మ్యాచ్ లో  ఇలా జరిగితే… ఈసారి వరల్డ్ కప్ ఇండియాదే …ఎందుకంటే…?

సౌత్ ఆఫ్రికాతో ఈరోజు మ్యాచ్ లో  ఇలా జరిగితే… ఈసారి వరల్డ్ కప్ ఇండియాదే …ఎందుకంటే…?

by Mounika Singaluri

Ads

2023 వన్డే ప్రపంచ కప్ ఆసక్తికరంగా సాగుతుంది. దాదాపు లీగ్ స్టేజి చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భారత జట్టు తన ఆల్రౌండర్ ప్రదర్శనతో సెమిస్ చేరుకుంది. భారత టీమ్ లో బ్యాటర్ లు, బౌలర్ లు విజృంభించి ఆడుతున్నారు. ఈసారి ఏమైనా సరే ఇండియా ప్రపంచ కప్పు కొడుతుంది అని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

Video Advertisement

అయితే భారత్ తో పాటు ఇప్పటికే సెమీఫైనల్ కు సౌత్ ఆఫ్రికా జట్టు చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా 10 పాయింట్ లతో సెమిస్ కు చేరువైంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ రేస్ లో ఉన్నాయి. అయితే ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరుకున్న భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య కోల్ కత్త వేదికగా ఆదివారం ఆసక్తికర పోరు జరగనుంది.

ఈ రెండు జట్లు ఇప్పటికే సెమిస్ చేరిన టేబుల్ టాపర్ ను డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు 2011 వరల్డ్ కప్ ను గుర్తుచేసుకుంటున్నారు. 2011లో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడింది. అది కూడా సౌత్ ఆఫ్రికా చేతిలో, అనంతరం విశ్వవిజేతగా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే ప్రపంచ కప్ భారత్ వేదికగా జరుగుతుంది. లీగ్ దశలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లోను ఓడిపోలేదు. ఆదివారం సౌత్ ఆఫ్రికా తో జరిగే మ్యచ్ లో భారత్ ఓడిపోతే 2011 ప్రపంచ కప్ రిజల్ట్ మరోసారి రిపీట్ అవుతుందమే సెంటిమెంట్ ను కొందరు అభిమానులు తెరమీదకు తీసుకువచ్చారు.

ఇది కొందరు అభిమానులకు విచిత్రంగా అనిపించొచ్చు అయితే సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం భారత్ పై సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా లీగ్ దశలో భారత్ ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే భారత్ జట్టుకున్న దిష్టి పోతుందని అభిమానులు అంటున్నారు. సౌత్ ఆఫ్రికా కూడా భీకరంగా కనిపిస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతిసారి 300 పైగా పరుగులు చేశారు.

చేజింగ్ చేస్తు నెదర్లాండ్ చేతిలో ఓడిపోయినా కూడా పాకిస్తాన్ పై నెగ్గి తాము చోకర్స్ కాదు అంటూ కెప్టెన్ బావుమా పేర్కొన్నాడు
అయితే రెండు టీంలు బలంగా ఉండడంతో ఆదివారం జరిగే పోరు అభిమానులను అలరించడం ఖాయం. మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆరంభం కానుంది.

Also Read:ప్రపంచ కప్ ఆడడానికి వచ్చి ఇవేం పనులు… ఏకంగా 7 లక్షలు..?” అంటూ… “బాబర్ అజాం” పై ఫైర్..!


End of Article

You may also like