Ads
మూడు పదుల వయస్సులో లేట్ గా టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లవర్స్ అంతా సూర్యకుమార్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే సూర్య పదేళ్ల క్రితమే ఓ అమ్మాయి మనసు దోచుకున్నాడని మీకు తెలుసా.. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాని అతనికి ఆమె ధైర్యాన్ని ఇచ్చింది.
Video Advertisement
అందుకే ఇప్పుడు సూర్య కుమార్ ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ రెచ్చిపోయి ఆడుతున్నా సూర్య వెనుక దేవీషా శెట్టి పాత్ర ఉందంటున్నారు సన్నిహితులు. వారి ప్రేమ, సూర్య జీవితంలో ఆ ప్రేమ తీసుకు వచ్చిన మార్పులేంటో చూద్దామా.. ముంబైలోని ఆర్. ఏ పోదర్ కాలేజ్ ఆ కామర్స్ అండ్ ఎకనామిక్స్ సూర్యకుమార్ బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
19 ఏళ్ల దేవీషా అప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యింది. అప్పటికే దేశవాళీ క్రికెట్ లో మంచి పేరు సంపాదించాడు సూర్య. అప్పుడే ఫ్రెషర్స్ పార్టీలో దేవీషాను చూడడం.. ఆ తర్వాత ఓ ఫ్రెండ్ ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. దేవీషా మంచి డాన్స్ కోచ్. మరో వైపు సూర్య ఇండియా టీంలో స్థానం కోసం పోరాడుతున్నాడు. 2012లో ఇండియా టీ20 లీగ్ లోకి ప్రవేశించినా 2015లో గానీ సరైన గుర్తింపు రాలేదు.
ఆ ఏడాది ముంబైతో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా తరుపున ఆడి 20 బాల్స్ లో 5 సిక్సులతో 46 రన్స్ చేసాడు. దీంతో ఒక్కసారిగా సూర్య అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇన్నింగ్స్ ని సూర్య బాగా ఎంజాయ్ చేసాడు. 2016 జులై 7న సూర్య – దేవీషా వివాహబంధంతో ఒక్కటయ్యారు. తన లైఫ్ లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఆమె అండగా ఉందని “బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్” అనే ఎపిసోడ్ లో సూర్య చెప్పాడు.
మా వివాహం తర్వాత నేను ఒక రోజు నాకు క్రికెట్ లో ఎదురైన కష్టాల గురించి మాట్లాడాను అప్పుడు నా మాటలకు తను అడ్డు పడుతూ.. నువ్వు ఆటంకాల గురించి మర్చిపోయి ఆటపై దృష్టి పెట్టు అని ప్రోత్సహించింది” అని సూర్య తెలిపాడు. ఆమె మాటలు సూర్యపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఐపీఎల్ 2018 లో ముంబై జట్టు 3.2 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సూర్య ముంబై టాప్ ఆర్డర్ లో రెచ్చిపోయి ఆడాడు.
అప్పటి నుంచి ఏటా 400 తో నిలకడగా కొనసాగుతున్నాడు. 2021 లో మాత్రం క్రికెట్ ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఎట్టకేలకు 2021లో ఇంగ్లాండ్ పై టీ20లో టీం ఇండియా తరుపున ఆడే అవకాశం లభించింది. టీం ఇండియాకు ఎంపికయ్యాక దేవీషా తనతో ఏం చెప్పిందో వివరించాడు సూర్య.. మ్యాచ్ రోజు ఉదయం 4 గంటలకు.. దేవీషా నాకో సలహా ఇచ్చింది.
నీ 10 సంవత్సరాల క్రికెట్ ప్రయాణం ఇప్పుడే మొదవుతుంది.. ఇది ఆరంభం మాత్రమే.. ఇదే ముగింపు కాకూడదు అని చెప్పిందని భావోద్వేగంగా చెప్పాడు సూర్య. ఆ క్షణంలో టీం ఇండియా చరిత్రలో తన పేరున ఓ పేజీ రాసుకోవాలనే కసి కనిపిస్తుంది. సూర్య ఎంత కసి.. ఆత్మవిశ్వాసంతో ఉన్నాడో ఫస్ట్ మ్యాచ్ లోనే చూపించాడు.
ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ టీం ఇండియా స్టార్ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్య ఇలా ఆడడం వెనుక దేవీషా మాటలు అతనిపై ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ఆమె చెప్పినట్టుగా సూర్యకిది ఆరంభం మాత్రమే. సూర్యకుమార్ టీం ఇండియాకు మరెన్నో విజయాలు అందించాలని ఆశిద్దాం . .
End of Article