Ads
సాధారణంగా మన సొసైటీలో ఒక అపోహ ఉంటుంది. పెళ్లయిన ఆడ వాళ్ళకి కెరియర్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అని. అది చాలా వరకు నిజం కూడా. ఒకవేళ వాళ్లు సినిమా రంగానికి కానీ, క్రీడా రంగానికి కానీ చెందిన వారు అయితే వాళ్ళ కెరియర్ పెళ్లితోనే ఆగిపోతుంది అని అనుకుంటారు. ఒకవేళ వాళ్లు పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్ కంటిన్యూ చేసినా కూడా పిల్లలు పుడితే వాళ్లు వర్క్ ఆపేస్తారు అని అనుకుంటారు.
Video Advertisement
మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా మన భారతదేశంలో మాత్రం ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు. కానీ ఎంతో మంది ఇది నిజం కాదు అని ప్రూవ్ చేశారు. కొంత మంది క్రీడాకారిణులు కూడా ఇదే విషయాన్ని తప్పు అని నిరూపించారు. ఆ క్రీడాకారిణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 మేరీ కోమ్
ఈ లిస్ట్ లో మేరీ కోమ్ పేరు లేకపోతే అసలు పూర్తి అవ్వదు. బాక్సర్ అయిన మేరీ కోమ్ పెళ్లి చేసుకున్న తర్వాత, నలుగురు పిల్లలను కన్న తర్వాత కూడా ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు.
#2 సానియా మీర్జా
పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్న సానియా మీర్జా, తర్వాత ఒక బాబుకి జన్మనిచ్చారు. ఆ తర్వాత తన ఆటను మళ్లీ కొనసాగించాలని తిరిగి ప్రాక్టీస్ చేయడం కూడా మొదలుపెట్టారు.
#3 సహాన కుమారి
హై జంప్ కేటగిరీలో జాతీయ రికార్డు సృష్టించిన సహాన కుమారి కూడా ఒలింపిక్స్ లో పాల్గొనే సమయానికి ఒక అమ్మాయికి తల్లి. కానీ తన భర్త ప్రోత్సాహంతో తర్వాత ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తన కూతురు కూడా హై జంప్ లో పాల్గొంటున్నారు.
#4 కోనేరు హంపి
చెస్ ఛాంపియన్ కోనేరు హంపి కూడా పెళ్లి చేసుకుని, తర్వాత ఒక బిడ్డకు తల్లి అయ్యారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు చెస్ కి దూరంగా ఉన్న కోనేరు హంపి 2019 లో తిరిగి మళ్ళీ తన ఆట మొదలు పెట్టారు.
#5 అనిత పాల్ దురై
భారత బాస్కెట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన అనిత 2013లో ఒక బిడ్డకు తల్లి అయ్యారు. తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసి బాస్కెట్ బాల్ ఆటని కొనసాగించారు.
#6 కృష్ణ పునియా
డిస్కస్ త్రో లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కృష్ణ పూనియా, ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.
#7 సరితా దేవి
బాక్సర్ అయిన సరితాదేవి ఎన్నో పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలను సాధించారు. ఆ తర్వాత పెళ్లి అయ్యి కొడుకు పుట్టిన తర్వాత కూడా ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ లో వెండి పతకాలు సాధించారు.
End of Article