నిన్నటి మ్యాచ్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచిన అంపైర్ …. అసలు ఈ ఎంపైర్ ఎవరో తెలుసా ?

నిన్నటి మ్యాచ్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచిన అంపైర్ …. అసలు ఈ ఎంపైర్ ఎవరో తెలుసా ?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో  ఒకే పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది.

Video Advertisement

 

మొదటి 4 బంతుల్లోనే రెండు వికెట్లు సమర్పించుకొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో కోల్కతా విజయానికి కేవలం మూడు పరుగులే కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కేకేఆర్ తరపున బ్యాటింగ్ కు వచ్చిన మోర్గాన్, కార్తీక్ 4 బంతుల్లో మూడు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచారు అంపైర్.

ఆ అంపైర్ పేరు పశ్చిమ్ గిరీష్ పాఠక్. పశ్చిమ్ పాఠక్ ముంబై కి చెందిన వారు. 2014 నుండి ఐపీఎల్ లో ఉన్న పశ్చిమ్ పాఠక్ కి ఇది 8వ ఐపీఎల్.  ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లో 2009 నుండి అంపైర్ గా ఉన్నారు పశ్చిమ్ పాఠక్. రెండు టెస్ట్ మ్యాచ్ లకు, మూడు ఒడిఐ లకు రిజర్వ్ అంపైర్ గా ఉన్నారు.

అలాగే 2012లో 2 ఉమెన్స్ ఒడిఐ మ్యాచెస్ కి కూడా అంపైరింగ్ వహించారు. అయితే పశ్చిమ్ పాఠక్ నెటిజన్ల దృష్టిలో పడడం, ఇదే మొదటిసారి కాదు. రాజస్థాన్ రాయల్స్, ఇంకా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కి జరిగిన మ్యాచ్ లో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. 2015 లో ఒక మ్యాచ్ ‌లో అంపైరింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించిన మొదటి భారత అంపైర్ ‌గా పశ్చిమ్ పాఠక్ నిలిచారు.

 


End of Article

You may also like