ఐపీఎల్ 2022: SRH పై ఓ రేంజ్ లో ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?

ఐపీఎల్ 2022: SRH పై ఓ రేంజ్ లో ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?

by Sunku Sravan

Ads

ఈసారి ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం ఆటగాళ్లు మారిన.. వారి ఆట తీరు మాత్రం మారలేదు. ప్రస్తుత సీజన్లో కూడా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో చేరారు. తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళ చేతిలో 61 తేడాతో ఓటమి పాలయ్యారు. రెండవ మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ పై 12 పరుగుల తేడాతో మరో అపజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ వేలానికి ముందు డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, జానీ బెయిరుస్టో వంటి ఆటగాళ్లను విడిచిపెట్టి అభిమానుల యొక్క ఆగ్రహానికి గురైన SRH. ప్రస్తుతం ఆటతీరుతో మరిన్ని విమర్శలను కూడా మూటగట్టుకుంది.

Video Advertisement

ఐపీఎల్ 2022 వేలంలో 6.5 కోట్ల రూపాయలు పెట్టి ఎస్ ఆర్ హెచ్ కొనుగోలు చేసినటువంటి అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. అభిషేక్ ఆడినటువంటి రెండు మ్యాచ్ లలో కూడా కేవలం 21 పరుగులు మాత్రమే చేశారు. రాజస్థాన్ రాయల్స్ పై జరిగినటువంటి మ్యాచ్ లో 19 బంతుల్లో అతను కేవలం 9 పరుగులు చేసి నిష్క్రమించారు.

ఇక లక్నో సూపర్ జెంట్స్ పై 13 పరుగులు మాత్రమే సాధించి పేవిలియన్ కు చేరాడు. ఓపెనర్లుగా జట్టుకు అద్భుతమైన శుభారంభం ఇవ్వాల్సినటువంటి అభిషేక్ తన ప్రదర్శనతో జుట్టును మరింత నిరాశ పరుస్తున్నాడు. ఈ సందర్భంలో అభిషేక్ శర్మపై ఎస్ ఆర్ హెచ్ అభిమానులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ తీరు మారదని అభిషేక్ శర్మను 6.5 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొన్నారో.. గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నాడని అతనికి డబ్బు దండగ అని అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

 


End of Article

You may also like