Ads
IPL 2022 ఎలిమినేటర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. తేలికపాటి జల్లు రావడంతో టాస్ కూడా ఆలస్యం చేశారు ఎంపైర్లు. ఆ తర్వాత వర్షం కొద్ది కొద్దిగా ఎక్కువ అయింది..
Video Advertisement
చిన్న తుంపరలు పడుతున్నాయని కేవలం పీచ్ ను మాత్రమే కవర్లతో కప్పారు. పెద్ద వర్షం గా మారడంతో స్టేడియం మొత్తం కవర్లతో నింపేశారు. లీగ్ స్టేజ్ లో లక్నో సూపర్ జెంట్స్ 9 మ్యాచ్లు విజయం సాధించగా బెంగళూరు 8 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది.
ఈ సందర్భంలో మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఎక్కువ విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెంట్స్ రెండవ క్వాలిఫైయర్ కు అర్హత పొందుతుంది. కానీ అంత ఈజీగా లక్నోకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కోల్కత్తాలో ముందుగానే వర్షాలను అంచనా వేసిన బీసీసీఐ, ప్లే ఆప్స్ మ్యాచ్లకు వర్షం అంతరాయం ఏర్పడినా రిజల్ట్ రాబట్టేందుకు కొన్ని మార్గదర్శకాలు ముందుగానే పెట్టింది.
అవేంటంటే మ్యాచ్ ప్రారంభ సమయానికి రెండు గంటలు లేట్ అయితే పూర్తి ఓవర్లు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ 9:40 ప్రారంభమైన రెండు జట్లు 20 ఓవర్లు ఆడాల్సిందే. ఆ తర్వాత ఆలస్యమైతే కొద్ది ఓవర్లను తగ్గిస్తూ వస్తారు. ఒకవేళ రాత్రి 11 గంటల 56 నిమిషాల కు ఆట ప్రారంభమైన ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ సాగుతుంది.
ఈ ఓవర్లలో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వారిదే విజయం. ఒకవేళ అప్పటికి కూడా వర్షం తగ్గకపోతే రాత్రి 12:50 నిమిషాల వరకు వేచి చూస్తారు. ఈ సమయానికి ప్రారంభమైన సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 కి వెళ్తుంది. ఒకవేళ వర్షం ఆగకుండా కురిస్తే మాత్రం ఆట కొనసాగించే అవకాశం లేకపోతే కేఎల్ రాహుల్ టీం, లీగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కారణంగా రాజస్థాన్ తో రెండో మ్యాచ్ ఆడటానికి అహ్మదాబాద్ వెళుతుంది. అయితే గత రెండు సీజన్లలో కూడా ప్లే ఆప్స్ చేరిన ఆర్సిబి, నాలుగో స్థానంలో నే ముగించింది.
End of Article