ఐపీఎల్ సీజన్లలో చాలా అదృష్టం ఉన్నటువంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయ శంకర్ మాత్రమే.. ఎలా అంటే విజయ్ శంకర్ పై వేలంలో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు.

Video Advertisement

కానీ గుజరాత్ జట్టు అనూహ్యంగా ఆయనను 1.4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మల్టీ డైమన్షన్ ఆటగాడిగా ముద్రపడిన విజయ్ శంకర్ ఐపీఎల్ లో తన పర్ఫామెన్స్ చూపించింది అయితే లేదు.

ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన 19 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ విధంగా జట్టుకు భారం అయ్యాడు తప్ప ఒరగా బెట్టింది ఏమి లేదు. ఈ విషయాన్ని తొందరగా గ్రహించిన పాండ్య అతని బెంచ్ కే పరిమితం చేసేసాడు. కానీ అదృష్టం ఉంటే మ్యాచులు ఆడకపోయినా సరే టైటిల్ గెలుచుకున్న జట్టులో ఒక సభ్యుడిగా ఉండటం విజయ్ కి మాత్రమే చెల్లింది. అతని విషయంలో ఇలా చేయడం మొదటి సారి కాదు.