Ads
లక్నో చేతిలో పరాభవం.. ఐపీఎల్ లీగ్ దశలోనే కేకేఆర్ నిష్క్రమణ..ప్లే ఆఫ్ రేసులో ఉండాలని భావించిన కోల్ కత్తాకి నిరాశే మిగిలింది. ముందు బౌలింగ్ లో విఫలమైనా,ఛేజింగ్ లో అద్భుతంగా పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. లక్నో ఓపెనర్ డికాక్ విధ్వంసానికి కెప్టెన్ రాహుల్ తోడుగా నిలిచిన వేళ బౌలింగులో మోహ్సిన్ ఖాన్, స్టోయినిస్ కోల్ కతాను అడ్డుకోగా.. లక్నో సూపర్ విక్టరీ సాధించింది. కేకేఆర్ పోరాటంతో మ్యాచ్ ఊగిసలాడిన, చివరి బంతి వరకు టెన్షన్ పెట్టినా,చివరకు లక్నోనే పై చేయి సాధించింది.
Video Advertisement
ఈ విజయంతో లక్నో ఏ అడ్డంకి లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జేయింట్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 210 పరుగుల భారీ స్కోరు చేసింది. డికాక్ (140) అజేయ సెంచరీతో చెలరేగగా..
రాహుల్ (68 నాటౌట్) రాణించడంతో కేకేఆర్ ముందు భారీ స్కోరు ఉంచింది. ఇక చేజింగ్ లో చివరి వరకు పోరాడిన కేకేఆర్ ను లక్నో బౌలర్లు నిలువరించారు. నితీష్ రానా (42), శ్రేయస్ అయ్యర్ (50), బిల్లింగ్స్ (36) రాణించగా.. ఆఖరులో రింకు సింగ్ (40), సునీల్ నరైన్ (21) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో కేకేఆర్ 208/8 స్కోరుకే పరిమితం కావడంతో లక్నో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. భారీ సెంచరీతో కదం తొక్కిన డికాక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
End of Article