“ఖతం …టాటా…గుడ్ బై” అంటూ పంజాబ్ పై SRH మ్యాచ్ ఓడిపోవడంతో10 ట్రోల్స్.!

“ఖతం …టాటా…గుడ్ బై” అంటూ పంజాబ్ పై SRH మ్యాచ్ ఓడిపోవడంతో10 ట్రోల్స్.!

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 సీజన్ లో చేతులారా అవకాశాలను చేజార్చుకున్న హైదరాబాద్ ప్లే ఆప్స్ బెర్తును కోల్పోయింది. ఇక చివరి మ్యాచ్ లో నైనా గౌరవప్రదంగా లీగ్ ముగించాలని భావించిన ఎస్ ఆర్ హెచ్ కు భంగపాటు తప్పలేదు. పంజాబ్ దెబ్బకు హైదరాబాద్ బ్యాటింగ్ లో అంతంత మాత్రంగానే రాణించగా బౌలింగులో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో పంజాబ్ జట్టుకు సూపర్ విక్టరీ మిగిలింది.

Video Advertisement

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన చివరి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 157/8 స్కోరుకే పరిమితమైంది. అభిషేక్ శర్మ(43), రాణించగా రోమోరియా (26 నాటౌట్ ), సుందర్ (25), మార్కురం (21), త్రిపాటి (20) కీలక పరుగులు చేశారు. చేజింగ్ లో మాత్రం పంజాబ్ చెలరేగిపోయింది.

లివింగ్ స్టోన్(49 నాటౌట్), ధావన్ (39), జితేష్(19) రాణించడంతో పంజాబ్ 15.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ హార్ప్రిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. హైదరాబాద్ జట్టును మోస్తారు స్కోరుకే కట్టడి చేసిన పంజాబ్ చేజింగ్ లో మాత్రం చెలరేగింది.

ప్రారంభం నుంచే పంజాబ్ దూకుడుగా ఆడింది. ఎంతో దూకుడుగా ఆడిన బెయిర్ స్టో (23) అవుట్ అయిన, క్రీజులోకి వచ్చినటువంటి షారుక్ ఖాన్ (19 )తో కలిపి మరొక ఓపెనర్ శిఖర్ ధావన్ (39) వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే లో పంజాబ్ 62 పరుగులు చేసింది. చివరికి 160 పరుగులు చేసి  విజయపతాకం ఎగురవేసింది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

 


End of Article

You may also like