Ads
ఇండియాలో క్రికెట్ కి, సినిమాలకి ఉన్న క్రేజ్ మరే ఇతర రంగాలకి ఉండదు. దాదాపు క్రికెట్ ని సినిమాలని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. క్రికెట్ కి సినిమాకు మంచి అనుబంధం కూడా ఉంటుంది. ఎంతోమంది క్రికెటర్లు సినిమా హీరోయిన్ లతో లవ్ ఎఫైర్లు నడిపించిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది సినిమా హీరోయిన్ లు క్రికెటర్ల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక నటి టీమిండియా స్టార్ క్రికెటర్ తో ఎనిమిదేళ్లు ప్రేమాయణం నడిపి తర్వాత బ్రేకప్ కావడంతో ఇప్పుడు తన కొడుకుతో ఒంటరిగా జీవిస్తుంది.
Video Advertisement
మనం మాట్లాడుకుంటున్న నటి హిందీ… సౌత్ సినిమాల్లో పనిచేసిన బాలీవుడ్ హీరోయిన్. చాలా మంది ప్రముఖ నటీనటులతో కలిసి పనిచేశారు. 39 ఏళ్ల నటి టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్‌తో రొమాన్స్ చేసింది. వారు 8 సంవత్సరాలు కలిసి జీవించారు. కానీ ఆ తర్వాత వీరి ప్రేమకథ అనూహ్యంగా ముగిసింది.ఆమె పేరు ఇషా శర్వాణి. ఈ బాలీవుడ్ నటికి మొదట మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత ఆశించినంతగా విజయాలు అందుకోలేకపోయింది.దర్వాజా బ్యాండ్ రఖో, యు మీ ఔర్ హమ్, లక్కీ బై ఛాన్స్, ఖరీబ్ ఖరీబ్ సింగిల్ చిత్రాల్లో ఇషా నటించింది. ఇది కాకుండా కొన్ని తమిళ, మలయాళ సినిమాలు కూడా చేసింది.
ఇక ఇషా శర్వాణి సినిమాల కంటే ఎక్కవ వ్యక్తిగత జీవితమే వార్తల్లో నిలిచింది.ఇషా ఇండియన్ స్టార్ క్రికెటర్ జహీర్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండేది. దాదాపు పదహారేళ్ల క్రితం జహీర్, ఇషా ఓ ఈవెంట్‌లో కలుసుకున్నారు. ఆ రోజు నుంచి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అనంతరం వీరి మధ్య ప్రేమ చిగురించింది
2012లో ఇషా శర్వాణి ఒక ఇంటర్వ్యూలో జహీర్ ఖాన్‌తో విడిపోవడం గురించి చెప్పింది. విడిపోవడానికి కారణం ఏమిటో నేను మీకు చెప్తాను. కానీ ఇప్పటికీ జహీర్‌ను తన బెస్ట్ ఫ్రెండ్‌గానే పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇషా శర్వాణితో విడిపోయిన తర్వాత, జహీర్ ఖాన్ స్నేహితుడి పార్టీలో మరో నటి సాగరిక ఘట్గేని కలిశాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.ఇషా ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఒంటరిగా ఉంటోంది.
End of Article