ఈ కిలాడీ దంపతుల స్కెచ్ చూసి పోలీసులే షాక్..! గోల్డ్ వ్యాపారం చేస్తూ…?

ఈ కిలాడీ దంపతుల స్కెచ్ చూసి పోలీసులే షాక్..! గోల్డ్ వ్యాపారం చేస్తూ…?

by Megha Varna

Ads

సినిమాటిక్ రేంజ్ లో ప్లాన్ చేశారు భార్యాభర్తలు. అందర్నీ నమ్మించి ఆఖరికి దుకాణం సద్దేసి వెళ్లిపోయారు. నమ్మిన వాళ్ళు అందరూ కూడా మోస పోవాల్సి వచ్చింది. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే… సాలెం జిల్లాలోని వీరంగం ప్రాంతానికి చెందిన వారు లలితా, తంగరాజన్. ఈ దంపతులు ఇద్దరూ కూడా రాజ గణపతి ఆలయం దగ్గర లలితాంబికా జువెలర్స్ అనే నగల షాపుని నడుపుతున్నారు. మంచిగా వీళ్ళ వ్యాపారం సాగుతోంది. మంచి పేరును కూడా వీరు పొందారు.

Video Advertisement

అయితే ఇంకాస్త డబ్బులు సంపాదించాలని ఈ దంపతులు భావించి ఏడాది రెండేళ్లు పాటు నెలకు డబ్బులు పెడుతూ ఉంటే ఎక్కువ వడ్డీ చెల్లించడంతో పాటు.. తమ వద్ద చీటీలు కట్టిన వాళ్ళకి తక్కువ ధరకు బంగారం ఇస్తామని ప్రచారం చేశారు. అంతా కూడా వీళ్ళని నమ్మి డబ్బులు కట్టడం మొదలుపెట్టారు. కేవలం ఆ ఒక్క ఊరు నుంచి మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి డబ్బులు కట్టడం మొదలుపెట్టారు. ఇంకేముంది ఒక రాత్రి వీళ్ళు మొత్తం అంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు.

గురువారం ఉదయం షాపు ఓపెన్ చేయకపోవడంతో కస్టమర్లకు అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం వేసి ఉంది. ఇంకేముంది సినిమా మొత్తం అర్థమైపోయింది. న్యాయం చేయాలంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు కూడా స్పాట్ కి చేరుకుని విచారణ చేశారు. షాప్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ని చూడగా… నగలను రాత్రికి రాత్రే ఎవరూ చూడకుండా రెండు రోజుల ముందే కార్ లో తీసుకువెళ్లారు.

డబ్బు కట్టిన వాళ్ళని మోసం చేసి భార్యాభర్తలు ఇద్దరూ పారిపోవాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. దాదాపు నాలుగు కోట్లకు టోకరా వేసి పారిపోయారు. ఈ దంపతులు కేవలం కస్టమర్లని మాత్రమే కాకుండా నగల దుకాణాల యజమానులను కూడా మోసం చేశారు. అప్పు చేసి ఆభరణాలు తెచ్చి డబ్బు కట్టకుండా ఇప్పుడు పారిపోయారు. ఇలా జువెలర్స్ షాప్ వాళ్ళని నమ్మిన అందరూ కూడా మోసపోయారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మి అనవసరంగా మోసపోకండి.


End of Article

You may also like