కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.కార్తీక దీపం సీరియల్ ఒరిజినల్ వెర్షన్ కరుత ముత్తు పేరుతో మలయాళం లో 2014 లో మొదలైంది. ఆ తర్వాత తెలుగులో, కన్నడలో, తమిళ్ లో కూడా రీమేక్ అయ్యింది. కన్నడలో ముద్దు లక్ష్మి పేరుతో ఈ సీరియల్ రీమేక్ అయింది. ఈ సీరియల్ లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కార్తీక్ పాత్ర పోషిస్తున్న నిరుపమ్ పరిటాల.

నిరుపమ్ తండ్రి ఓంకార్ గారు ప్రముఖ నటులు ఇంకా రచయిత. ఓంకార్ గారికి నిరుపమ్ ఈ రంగం వైపు రావడం అంత పెద్దగా ఇష్టం లేదట. కానీ నిరుపమ్ కి మాత్రం యాక్టర్ అవ్వాలనే ఆలోచన చిన్నప్పటినుంచి ఉంది. నిరుపమ్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఎంబీఏ చదివారు.2008 లో చంద్రముఖి సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నిరుపమ్. ఆ సీరియల్ నిరుపమ్ కి ఎంతగానో పేరు తీసుకువచ్చింది. తర్వాత కాంచన గంగ, మూగ మనసులు, కలవారి కోడళ్ళు ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు.

nirupam in fitting master movie

తన నటనకి గాను ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు నిరుపమ్. సీరియల్స్ లోనే కాకుండా ఫిట్టింగ్ మాస్టర్ వంటి సినిమాల్లో కూడా నటించారు. ఈ సినిమాలో నిరుపమ్ కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

మొదటి సీరియల్ చంద్రముఖి లో తనతో పాటు కలిసి నటించిన మంజుల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిరుపమ్. వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. నిరుపమ్ యాక్టర్ మాత్రమే కాకుండా రచయిత కూడా.

ఎన్నో టీవీ క్యారెక్టర్స్ కి స్క్రిప్ట్ రాశారు. నెక్స్ట్ నువ్వే సినిమాకి కూడా స్క్రిప్ట్ రైటర్ గా చేశారు. ప్రేమ సీరియల్ కి నిర్మాతగా కూడా వ్యవహరించారు. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు గా తెలుగు ప్రేక్షకులందరికీ ఇంకా చేరువయ్యారు నిరుపమ్.

ఈ సీరియల్ లో నిరుపమ్ పర్ఫామెన్స్ నచ్చడంతో, చిరంజీవి తల్లి అంజనా దేవి గారు ఒక బుట్టలో మామిడి పళ్ళు ప్యాక్ చేయించి నిరుపమ్ కి పంపారట. అంతేకాకుండా పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా నిరుపమ్ నటనని ప్రశంసించారు.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com