“డాక్టర్ బాబు” దెబ్బ మామూలుగా లేదుగా..? “కార్తీకదీపం” లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..!

“డాక్టర్ బాబు” దెబ్బ మామూలుగా లేదుగా..? “కార్తీకదీపం” లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..!

by Megha Varna

Ads

బుల్లితెర ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ పెంచిన సీరియల్ కార్తీకదీపం. దీని గురించి తెలియని వారు ఉండరు. అక్టోబర్ 18 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూస్తే.. రాత్రి కార్తీక్ ఇంటికి వెళ్లకుండా దీప ఇంటి ముందే కూర్చుంటాడు. దీప తలుపు తీసేసరికి కార్తీక్ ఉంటాడు దీంతో దీపా డాక్టర్ బాబు మీరు ఇక్కడేంటి అని కంగారు పడుతుంది మామూలుగానే కూర్చున్నా అని కార్తీక్ చెప్తాడు.

Video Advertisement

నువ్వు వెళ్లి పని చూసుకో అని అంటాడు. ఆ తర్వాత కార్తీక ‘నీకు పిల్లలు ఉన్నారు కదా..?’ అని అంటాడు. అవును ఇద్దరు ఆడపిల్లలు అని చెప్తుంది దీపా.

karthika deepam doctor babu in ranga ranga vaibhavanga movie

వాళ్లంతా అమెరికా వెళ్లిపోయారని చెప్తుంది. కార్తీక్ షాక్ అయ్యి ‘సౌర్య ఇక్కడే ఉంది మన కోసం వెతుకుతోంది’ అని మనసులో కార్తీక్ అనుకుంటాడు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు అనుకుని నువ్వు నా దగ్గర ఉండి పోయావా అని అనుకుంటాడు మనసులో కార్తీక్. పైగా ఇప్పుడు నీకు నిజం చెప్పినా సరే మోనిత కి ఎదురు తిరుగుతావు అది ప్రమాదం అని మనసులో అనుకుంటాడు.

ఆ తరవాత తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టి ఇస్తావా అని అడుగుతాడు. దీప ఐదు నిమిషాల్లో పెట్టి ఇస్తాను కూర్చోండి అంటుంది. ఇంతలో కార్తీక్ కోసం మోనిత వస్తుంది. ఎంత ధైర్యం నీకు అని మొదలు పెడుతుంది… మోనితని దీప చెంపమీద కొడుతుంది. ఏది వాగుకు నేను లేచి చూసే సరికి డాక్టర్ బాబు బయట కూర్చున్నారు అని చెప్తుంది.

భార్యను కొడితే పట్టించుకోవా అని మోనిత డాక్టర్ బాబుతో కోపంగా అడుగుతుంది. భార్య ఎవరు భార్య నువ్వా, వంటలక్క అని అడుగుతాడు కార్తీక్. ఇద్దరు బిత్తరపోయి డాక్టర్ బాబు వైపు చూస్తారు. మతిమరుపు బ్యాచ్ కదా అందుకే అడిగాను అని డాక్టర్ బాబు అంటాడు.

నువ్వు వంటలక్క కి సపోర్ట్ చేస్తున్నావ్ అని నాకు అర్థం అయిందని మోనిత అంటుంది. ఆ తర్వాత చంప రుద్దుకుంటుంది మోనిత. కార్తీక్ ఏమీ తెలియనట్టే ఏమైంది అని అడుగుతాడు. అప్పుడే మర్చిపోయావా కావాలనే ఇలా అడిగావా అని అడుగుతుంది మోనిత.

ఈలోగా దుర్గా వచ్చి మొనిత రవ్వ దోశ తెచ్చాను నీకు నాకు అని చెప్తాడు. దుర్గా నాటకం కార్తీక్ కి కూడా అర్థమవుతుంది. వంటలక్క దగ్గరకి వెళ్లి తినేసి వస్తాను అంటాడు కార్తీక. దీప బాక్స్ పట్టుకొని వస్తుంది ఈలోగా. రాత్రి మీకోసమే ఆలోచిస్తూ అన్నం తినలేదు దానితో పులిహోర చేశాను తిందాము అని వంటలక్క అంటుంది. పద తిందామని డాక్టర్ బాబు అనేసరికి మోనితకి కాలుతుంది.

తరవాత బట్టల షాపులో పనిచేసే శివలత బాబు కోసం వస్తుంది. బాబుని చూసుకోవడానికి మీ మేడం కి ఖాళీ లేదా అని అంటదు కార్తిక్. మోనిత ఏదో కవర్ చేయడానికి చూస్తుంది కానీ కార్తీక్ ఏ పంచ్లు వేస్తాడు. దీప చేతిలో బాబు ఉంటాడు. లాక్కోవడానికి ట్రై చేస్తుంది మోనిత కానీ నేనే ఎత్తుకోమన్నాను దీపని అంటాడు. ఎప్పుడైనా బాబు ఏడిస్తే నువ్వే ఎత్తుకో ఎవరు నిన్ను ఆపరు అంటాడు కార్తీక్.

 


End of Article

You may also like