Ads
సన్‍రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత సంవత్సరం చాలా ట్రోల్ అయిన టీం ఇదే. ఈ సంవత్సరం చాలా మంది పొగుడుతున్న టీం కూడా ఇదే. గత సంవత్సరం ఈ టీం ఎంత ట్రోల్ అయ్యింది అంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఈవెంట్ లో, సన్ పిక్చర్స్ అధినేత అయిన కళానిధి మారన్ తో రజినీకాంత్ స్టేజ్ మీద, హైదరాబాద్ జట్టులో మంచి ప్లేయర్స్ ని పెట్టమని, మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాళ్లు సరిగ్గా ఆడకపోతే కావ్య మారన్ టెన్షన్ పడడం తాను చూడలేకపోతున్నాను అని చెప్పారు. ఇది రజనీకాంత్ సరదాగా అన్నమాట. కానీ సీరియస్ గా జరిగిన విషయం ఇదే. కావ్య గత సంవత్సరం చాలా ట్రోల్ అయ్యారు.
Video Advertisement
ప్లేయర్స్ ని ఎలా ఎంచుకోవాలో తెలియదు అంటూ విపరీతంగా తిట్టారు. ప్రతి మ్యాచ్ లో బాధగా కూర్చునేవారు. ఆమెను చూసిన ప్రేక్షకులకు బాధగా అనిపించేది. ఇది కేవలం గత సంవత్సరం మాత్రమే కాదు. గత మూడు సంవత్సరాలుగా ఇదే నడిచింది. కానీ ఈ సంవత్సరం కట్ చేస్తే, హైదరాబాద్ జట్టు మ్యాచ్ లో వాళ్ళ ప్రదర్శన కావ్య సంతోషపడేలా చేస్తోంది. దాంతో కావ్యని అందరూ పొగుడుతున్నారు. అయితే, ఈ సంవత్సరం ఐపిఎల్ కి కావ్య తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల ఇలా జరిగింది అని అంటున్నారు. ఆ నిర్ణయం వల్లే టీం ప్రదర్శన బాగుంది అని అంటున్నారు. అదేంటంటే, ఐపీఎల్ 2024 కి ముందు జరిగిన వేలంలో, ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్ లని తీసుకోవడమే.
ఆక్షన్ లో వీళ్ళ మీద చాలా గట్టి కాంపిటీషన్ ఉంది. ఎంతో మంది పెద్ద అమౌంట్ వీళ్ళ మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కావ్యకంటే అనుభవం కలిగిన ఇతర టీం యాజమాన్యం ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళందరి మధ్యలో కూడా కావ్య తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఎంత ఖర్చు పెట్టి అయినా సరే వాళ్ళని తన టీంలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నారు. పోటీ ఎంత బలపడుతున్నా కూడా తాను కూడా వెనకడుగు వేయలేదు. ఇవాళ అందుకే వాళ్ళు టీంలోకి వచ్చారు. వాళ్ల ఆటతీరు వల్లే హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఇంత మెరుగుపడింది. కావ్య తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టీం ఇంత మారింది అంటూ అందరూ కావ్యని అభినందిస్తున్నారు.
ALSO READ : ఈ ప్రోగ్రాంలో వచ్చిన అమ్మాయి ఇప్పుడు తెలంగాణ గర్వించే స్థాయికి చేరుకుంది..! ఎవరో గుర్తుపట్టారా..?
End of Article