బ్యాట్ పై “ఓం”..‘జై శ్రీ హనుమాన్’ అంటూ పోస్ట్‌…పాక్‌ను ఓడించిన ఈ ఆంజనేయ భక్తుడు ఎవరో తెలుసా.?

బ్యాట్ పై “ఓం”..‘జై శ్రీ హనుమాన్’ అంటూ పోస్ట్‌…పాక్‌ను ఓడించిన ఈ ఆంజనేయ భక్తుడు ఎవరో తెలుసా.?

by Harika

Ads

పాకిస్తాన్‌పై గెలుపొందాక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కేశవ్‌ మహరాజ్‌ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ పోస్ట్‌లో జై శ్రీ హనుమాన్ అంటూ నినాదం చేసారు కేశవ్‌ మహరాజ్‌. ఒక విదేశీ ప్లేయర్ ఇలా చేయడంతో చాలామంది షాక్ అయ్యారు. అయితే సౌతాఫ్రికాలోనే పుట్టి, పెరిగిన కేశవ్, హిందూ ధర్మాన్ని పాటిస్తాడు. అతని పూర్తి పేరు కేశవ్ ఆత్మానంద్ మహరాజ్. అతని పూర్వికులు భారత్ కి చెందిన వారే. 1990 ఫిబ్రవరి 7వ తేదీన డర్బన్‌లోని నాటల్‌లో జన్మించాడు కేశవ్. అతని పూర్వికులు దక్షిణాఫ్రికాలో స్థిరపడినప్పటికీ హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. అందుకే కేశవ్ మూలాలు మర్చిపోకుండా అలా చేసాడు.

Video Advertisement

హనుమంతుడి భక్తుడైన కేశవ్ బ్యాట్‌ మీద ఓం గుర్తు ఉంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో జై శ్రీ రామ్‌, జై శ్రీ హనుమాన్‌ అని రాసుకున్నాడు. భారతీయ మూలాలు మర్చిపోని కేశవ్ తరచూ భారత్ కు వచ్చి అంజనేయుడి దేవాలయాలను సందర్శిస్తుంటాడు. ప్రపంచ కప్ 2023 మొదలవడానికి ముందు తిరువనంతపురంలోని ఆలయాన్ని సందర్శించాడు.

ప్రపంచ కప్ 2023 టోర్నీలో భాగంగా శుక్రవారం నాడు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్‌ పై  సౌతాఫ్రికా విజయాన్ని సాధించి పాయిట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. చివరి వికెట్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ చివరి వరకూ గెలుపు కోసం పోరాడింది. అయితే పాకిస్థాన్‌ గెలుపుకు సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహారాజ్ అడ్డుగా నిలిచాడు. దాంతో సౌతాఫ్రికా పాక్ పై గెలుపు సాధించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 270 పరుగులు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో , క్లాసేన్ 12, మిల్లర్ 29 ఆ తరువాత వచ్చిన  ఐడెన్‌ మార్క్రామ్ 91 పరుగులు చేసి, స్కోర్ 250 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. వరుసగా వికెట్లు తీసిన పాక్‌ బౌలర్లు, పరుగులు పెద్దగా ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. చివర్లో బ్యాటింగ్ వచ్చిన కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షమ్సీ తో కలిసి ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు.

కేశవ్ 21 బంతుల్లో 7 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2009 అనంతరం టీ20, వన్డే ప్రపంచ కప్‌లలో పాకిస్థాన్‌ జట్టు పై సౌతాఫ్రికాకు ఇదే మొదటి గెలుపు. ఈ గెలుపు కారణమైన కేశవ్ మహరాజ్ భారత సంతతికి చెందిన ప్లేయర్. కేశవ్ పూర్వీకులు ఇండియా నుంచి ఉపాధి కోసం సౌతాఫ్రికాకు వలస వెళ్ళి, అక్కడే స్థిరపడ్డారు. అతని తండ్రి ఆత్మానందం క్రికెటర్. అయితే వర్ణవివక్ష వల్ల ఎదగలేకపోయాడు. కెరీర్ మొదట్లో సీమ్ బౌలర్, ఆల్‌రౌండర్ గా ఉన్న కేశవ్, ఆ తర్వాత స్పిన్నర్ గా మారాడు.

https://www.instagram.com/p/Cy6bQ9fSKq_/

2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రవేశించాడు. మొదటి మ్యాచ్‌లో స్మిత్‌ను డకౌట్‌గా చేయడంతో గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత టీ20ల్లో ఎంట్రీ ఇవ్వడంతోనే కెప్టెన్‌గా మారాడు.


End of Article

You may also like