లాక్ డౌన్ కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటిల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, క్రికెటర్ విరాట్ కొహ్లీ లాక్ డౌన్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాకి ముందే విదేశాల నుండి వచ్చిన వీరిద్దరూ సెల్ఫ్ క్వారంటైన్ లో కాలం గడుపుతూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.

Video Advertisement

తాజాగా విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో త్రోబ్యాక్ అంటూ గడ్డంతో ఉన్న ఓ పిక్ పోస్ట్ చేశాడు. ఆ ఫోటోపై గ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్ ‘‘ముందు ఆ గడ్డం తీసేయి’’ అంటూ కామెంట్ చేశాడు. దానికి విరాట్ కౌంటర్ హైలైట్. ‘‘నీ టిక్‌-టాక్ వీడియోల కంటే ఇది బాగుంది’’ అంటూ కౌంటర్ వేశారు విరాట్. గతకొన్ని రోజుల నుండి కెపి టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

లాక్ డౌన్ పీరియడ్ గతంలో విరాట్ కి హెయిర్ కట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసిన అనుష్క ఇటీవలే విరాట్ డైనోసార్ లా నడుస్తున్న వీడియోని పోస్ట్ చేసింది.. విరాట్ కొహ్లీ డైనోసార్ లా నడుస్తున్న ఫన్నీ వీడియోని పోస్ట్ చేస్తూ.. I spotted dinosaur అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసింది అనుష్కా శర్మ..దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తే,  నాగ్ పూర్ పోలీసులు డైనోసార్ ని పట్టుకోవడానికి రెస్క్యూ టీం ని పంపాలా?? అంటూ రిప్లై ఇచ్చారు.. నాగ్ పూర్ పోలీసులు ఇచ్చిన ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది..