రాజన్నా హస్తం ……పేదల ఆకలి తీర్చే అభయ హస్తం….. భావోద్వేగంలో వెంకన్న ……

రాజన్నా హస్తం ……పేదల ఆకలి తీర్చే అభయ హస్తం….. భావోద్వేగంలో వెంకన్న ……

by Anudeep

Ads

మన ఆంద్రప్రదేశ్ కు చెందిన మహానేత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయి నేడు మన మధ్య లేరు. నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల.. మహానేతకు నివాళులర్పించారు.తర్వత తన కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఆయన రాజ్యస్ఫూర్తి కి, పరిపాలనకు, పేదల పట్ల కరుణకు ప్రతీక.

Video Advertisement

Komatireddy Venkat Reddy Speaks about YSR | YS Rajasheka Reddy 10th Death Anniversary - YouTube

చాలా కుటుంబాలు పూజ గదిలో ఆయన ఫోటో ను ఉంచి దైవంలా పూజిస్తారు. పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళ ఎదుగుదలకు అడుగడుగునా అండగా నిలబడిన ప్రజానాయకుడు వైఎస్సార్‌.అన్ని గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి మరియు వారి వీధులు కు, జంక్షన్‌లకు ఆయన పేరు పెట్టారు. ప్రజలు ఆయన్ని తమ సొంత తోబుట్టువుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన గతించి ఇన్ని సంవత్సరాలు గడిచిన అందరి మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నేత వైఎస్సార్‌.

Fight in Andhra Pradesh Congress over YSR legacy - India News

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్‌ ను గుర్తుచేసుకొని తన మనసులో ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని గురించి చెప్పారు. ఆయన ట్విట్టర్లో..‘‘అన్నలా మీరిచ్చిన భరోసా.. ‘వెంకన్నా’ అంటూ పిలిచిన ఆ పిలుపులోని ఆప్యాయత.. ఎప్పటికీ శాశ్వతం రాజన్న! జన హృదయ నేతకు నివాళులు’’ అంటూ తన మనసులోని భావాలను ట్విట్ రూపంలో అందరితో పంచుకున్నారు.

No photo description available.

“ఆ హస్తం.. పేదల ఆకలి తీర్చే భరోసా

ఆ హస్తం.. కూలుతున్న గుడిసెకు భరోసా

ఆ హస్తం.. సరస్వతీ పుత్రులకు ఫీజు రియంబర్సుమెంటు ప్రోత్సాహం

ఆ హస్తం.. కుటిల రాజకీయాలకు పాశుపతాస్త్రం

పేదల చిరునవ్వుల్లో చిరంజీవిగా నిలిచిన జన హృదయ నేతకు ఇదే నా నివాళులు “అంటూ ఎందరో కాంగ్రెస్‌ నేతలు రాజన్న ను గుర్తు చేసుకొని ఆయన ఔన్నత్యం గురించి వ్యాఖ్యానించారు.


End of Article

You may also like