ఆ స్టార్ బౌలర్ ను బౌలింగ్ వద్దు అని చెప్పిన ధోని… ఎందుకో తెలుసా…?

ఆ స్టార్ బౌలర్ ను బౌలింగ్ వద్దు అని చెప్పిన ధోని… ఎందుకో తెలుసా…?

by Mounika Singaluri

కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని తన ప్రయోగాలతో చాలా ప్రఖ్యాతి సంపాదించాడు. ఒక జట్టులో ఆటగాడు బలాలను, బలహీనతలను అంచనా వేయడంలో ధోని మించిన వారు లేరు. అందుకు అనుగుణంగానే వారి చేత బ్యాటింగ్ చేయించడం బౌలింగ్ చేయించడం చేస్తూ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పుడు త్వరలో జరగబోయే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక స్టార్ బౌలర్ కు ధోని పలు సూచనలు చేశాడట. అతనితో ప్రయోగాలు చేస్తున్నట్లు అతనికి సీజన్ కి ముందే సూచించాడట.

Video Advertisement

గత రెండు ఐపీఎల్ సీజన్ లలో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో విజయవంతమైన స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న శ్రీలంక ఆల్ రౌండర్ మహేష్ తీక్షణ హ్యాట్రిక్ టోర్నీ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో 2022 ఐపీఎల్ లో 9 మ్యాచ్ లు ఆడి 12 వికెట్లు తీసిన తీక్షణ, 2023 ఐపీఎల్ లో 11 వికెట్లు తీశాడు. కానీ ఫీల్టింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అయితే కీలక మ్యాచ్ లలో బౌండరీలు వదిలేయడం, క్యాచ్ లు వదిలేయడంతో చెన్నై అభిమానులు తీక్షణను బాగా ట్రోలింగ్ చేశారు. అయితే ధోని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. అయితే తీక్షణకు ధోని స్వీట్ షాక్ ఇచ్చాడని తెలుస్తుంది.

ఈసారి ఐపీఎల్ లో నువ్వు బౌలింగ్ చేయవద్దు… కేవలం బ్యాటింగ్,ఫీల్డింగ్ పైన దృష్టి సారించూ అని చెప్పాడంట. అయితే తన బౌలింగ్ తో కీలక మ్యాచ్ లు నెగ్గించిన తీక్షణకు ధోని అలా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదట. అయినా ధోని ఏం చెప్పినా తమ టీం కోసమేనని తీక్షణ చెప్పుకొచ్చాడు. ధోని తన నుండి బ్యాటింగ్, ఫీల్డింగ్ ఆశిస్తున్నాడని దానికి తాను సిద్ధమైనట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.


You may also like

Leave a Comment