ఐపీఎల్ 2020 లో ఇవాళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పోటీపడనున్నాయి. 10 పాయింట్లతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 5వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐదు మ్యాచ్లు గెలవగా, ఆరు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ప్రీతి జింటా ఓనర్ అయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కె. ఎల్. రాహుల్ కెప్టెన్ గా ఉన్నారు.

మీరు ఎప్పుడైనా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు లోగో గమనించారా? రెండు సింహాలు ఉండి, కింగ్స్ అని రాసి ఉండి, దాని కింద 11 రోమన్ నెంబర్ రూపంలో, అలాగే చివరిలో పంజాబ్ అని రాసి ఉంటుంది. ఇదంతా సరే, కానీ లోగో మొదట్లో కె.జె.హెచ్.పి.హెచ్ (K.J.H.P.H) అని రాసి ఉండడం ఎవరైనా గమనించారా?

బహుశా చాలామంది ఇది గమనించే ఉంటారు, వారికి దాని అర్థం ఏంటి అనే విషయం కూడా ఉంటుంది. కొంతమంది అంత పెద్దగా చూసి ఉండరు. K.J.H.P.H అంటే అర్థం ఏంటంటే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు లోగో మీద ఉన్న K.J.H.P.H అక్షరాలు జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానా ప్రాంతాల పేర్ల యొక్క మొదటి అక్షరాలు. అంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కేవలం పంజాబ్ ని మాత్రమే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్, హర్యానా, లని కూడా రిప్రజెంట్ చేస్తుంది.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com