మ్యాడ్ మ్యాక్సీ… ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు ఒక ట్రెండింగ్. తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాని సెమీఫైనల్స్ కి చేర్చిన మొనగాడు మాక్సీ…2023 వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాకి ఆఫ్గనిస్తాన్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 50 ఒవర్స్ కి 291 పరుగులు చేసింది. ఆఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ సెంచరీ చేసి ఆఫ్ఘనిస్తాన్ టీంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరు ఊహించని విధంగా ఈ ఆఫ్గాన్ ఆటగాడు రెచ్చిపోయాడు.

Video Advertisement

 

తర్వాత 292 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కి దిగింది. ఆస్ట్రేలియన్ టాప్ ఆర్డర్ అంతా వరుస పెట్టి వికెట్లు కోల్పోతూ కుప్పకూలింది. 91 పరుగులు వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఇక వెంటనే ఆల్ అవుట్ అయిపోతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అక్కడ క్రీస్ లో ఉంది ఎవరో తెలుసు కదా…ఆస్ట్రేలియన్ హార్ట్ హిట్టర్ మాక్స్ వెల్. అతని ఆట తీరు చూసిన ఎవరికైనా సరే అమ్మోరు గాని పూనిందా అనుకోకమానరు. 200 పరుగులు చేసి 2023 ప్రపంచ కప్ లో ఒక రికార్డు అయితే సృష్టించాడు. మాక్స్ వెల్ బ్యాటింగ్ చూసిన ఎవరైనా కూడా ఏంటి బాదుడు, ఏంటి విధ్వంసం అంటారు. అతనికి తోడుగా ఫ్యాట్ కమ్మిన్స్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహకారం అందించాడు.

తనకి ఆకాశమే హద్దు అన్న విధంగా మాక్స్ వెల్ రెచ్చిపోయాడు. ఆఫ్గనిస్తాన్ బౌలర్ లు అద్భుతంగా బౌలింగ్ చేసిన కూడా తనకి ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్ మొత్తం తనదే అన్నట్టు ఫోర్లు, సిక్స్ లు కొడుతూ ఆస్ట్రేలియానీ విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ నెగ్గితే ఆస్ట్రేలియా సెమిస్ కి చేరుతుంది అని మాక్స్ వెల్ కి తెలుసు. ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకుని అతడు ఆడాడు. హెల్మెట్ కూడా తీసేసి నువ్వు ఏ బాల్ వేసినా సరే నేను సిక్స్ కొడతా అన్నట్టు అతని ఆట తీరు సాగింది. ఓడిపోతుందన్న ఆస్ట్రేలియానీ 46వ ఓవర్ 5దో బాల్ కే 293 పరుగులు చేసి విన్నర్ గా నిలబెట్టాడు. అయితే ఆఫ్గనిస్తాన్ మాత్రం సెమిస్ కి చేరాలంటే ఇంకో మ్యాచ్ ఉంది.అది నెగ్గితే గాని సెమీస్ అవకాశాలు పై స్పష్టత రాదు.

ఈ మ్యాచ్ పుణ్యమా అంటూ… ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులందరూ మాక్స్ వెల్ బ్యాటింగ్ కి దాసోహం అయిపోయారు. సోషల్ మీడియాలో ఎవరి స్టేటస్ చూసిన మాక్స్ వెల్ తో నిండిపోయింది. ఏ చోట చూసినా మాక్స్ వెల్, మాక్స్ వెల్,మాక్స్ వెల్…. అతని ఆట తీరుకి ఒకే ఒక్క మాట… వెల్డన్ మాక్స్ వెల్…

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.