ఆ తప్పులే టీమిండియా కొంపముంచింది…సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా జాగ్రత్త పడకపోతే..!

ఆ తప్పులే టీమిండియా కొంపముంచింది…సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా జాగ్రత్త పడకపోతే..!

by Mohana Priya

Ads

ఐదవ టెస్ట్ సిరీస్‌ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో భారత్ విఫలం అవ్వడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇది భారత జట్టు తన చేతులతో తన చేసుకున్న తప్పు అని క్రిటిక్స్ అంటున్నారు. రోహిత్ శర్మ, అజింక్య రహానే తప్ప మిగిలిన ఎవరు డబల్ డిజిట్ స్కోర్ చేయలేకపోవడం గమనార్హం.Mistakes made by team India on IND vs ENG day 1 test match

Video Advertisement

రెండవ టెస్ట్ గెలిచిన జట్టు, మూడవ టెస్ట్ లో కనీసం పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల చాలా మంది అభిమానులు తమ కోపాన్ని వ్యక్తం చేశారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్కోరు అందుకు లేకపోవడం, బౌలింగ్‌లో కూడా అలాగే చేయడం వల్ల విశ్లేషకులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఈ విషయాలపై గల కారణాలులనే ఇలా వివరించారు.Mistakes made by team India on IND vs ENG day 1 test match

#1 టీమిండియా బ్యాట్స్‌మెన్ షాట్ సెలెక్ట్ చేసుకునే విధానం సంతృప్తికరంగా లేదు అని విశ్లేషకులు అంటున్నారు. అందులోనూ ముఖ్యంగా డ్రైవ్ ల విషయంలో చాలా పొరపాట్లు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడమే ఇందుకు ఉదాహరణ. బంతి వేగం కదలికలను తక్కువగా అంచనా వేశారు. ఈ కారణంగానే టైమింగ్ మిస్ అయ్యారు. మొదటి ఓవర్ ఐదో బంతిగా అండర్సన్ విసిరిన ఇన్ స్వింగర్‌ ని అర్థం చేసుకోవడంలో కె.ఎల్.రాహుల్ తడబడ్డారు. ఇంక నాలుగవ ఓవర్లో ఛతేశ్వర్ పుజారా పెవిలియన్ చేరారు.Mistakes made by team India on IND vs ENG day 1 test match

#2 10వ ఓవర్ 5వ బంతికి కోహ్లీ అవుట్ అయ్యారు. అండర్సన్ వేసిన అవుట్ స్వింగర్ ని మిడాఫ్ దిశగా డ్రైవ్ చేయాలని అనుకున్నారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ కూడా టైమింగ్ మిస్ అవడంతో మళ్ళీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని బట్లర్ అందుకున్నారు. కోహ్లీ అవుట్ అయిన తీరుని సునీల్ గవాస్కర్ కూడా తప్పుపట్టారు.Mistakes made by team India on IND vs ENG day 1 test match

కవర్ డ్రైవ్ లో కోహ్లీ బలహీనతలు బయటపడ్డాయి అని, బ్యాట్స్‌మెన్ లోపాన్ని సరి చేసుకోలేదు. నేరుగా స్టంప్స్ మీదకి వచ్చిన బాల్స్ డ్రైవ్ చేయడంలో విఫలం అవడంతో అవి ప్యాడ్స్ కి తగిలి ఎల్బీగా వెనుతిరగడం కూడా ఇందుకు ఒక ముఖ్యమైన కారణం. కోహ్లీ తర్వాత వెంటనే రవీంద్ర జడేజా, బూమ్రా కూడా ఎల్బీ గా వెనుదిరిగారు. అందుకు కూడా కారణం ఇదే.Mistakes made by team India on IND vs ENG day 1 test match

#3 బ్యాట్స్‌మెన్  చేసిన అదే తప్పుని బౌలర్లు కూడా కంటిన్యూ చేశారు. 42 ఓవర్లు బౌల్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. లైన్ అండ్ లెంత్ దొరకబుచ్చుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు దూసుకెళ్లిన అదే పిచ్ మీద మన వాళ్ళు అంత ఘోరంగా ఓటమిపాలవ్వడానికి ముఖ్య కారణం, మన వాళ్ళు అప్రమత్తంగా బాల్స్ వేయకపోవడమే అని విశ్లేషకులు అన్నారు.Mistakes made by team India on IND vs ENG day 1 test match

బౌలర్లు అందరూ ఎక్కువగా లూస్ బాల్స్ ని సంధించారు. రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించడానికి ప్రధాన కారకులు బౌలర్లు. కానీ వీరు ఇలా ఆడడంతో, అంత పెద్ద విజయం సాధించడానికి కారణమైన వాళ్ళు వీళ్లేనా అనే అనుమానాలు ప్రేక్షకులలో నెలకొన్నాయి.Mistakes made by team India on IND vs ENG day 1 test match

#4 రెండో టెస్ట్ లో ఎంతో బాగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్ ని ఆలస్యంగా ఎటాకింగ్ కి దింపారు. ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. కొత్త బాల్ తో మొహమ్మద్ సిరాజ్ అద్భుతాలు సృష్టించగలరు అనే విషయం విరాట్ కోహ్లికి తెలిసినా కూడా సిరాజ్ చేతికి బంతిని ఆలస్యంగా ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు అని అంటున్నారు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ప్రభావం చూపట్లేదు అనే విషయం తెలిసిన వెంటనే బౌలింగ్లో మార్పులు చేయాల్సి ఉన్నా కూడా విరాట్ కోహ్లీ ఆ పని చేయకపోవడం అందరికీ చాలా వింతగా అనిపించింది.Mistakes made by team India on IND vs ENG day 1 test match

#5 బాల్ సిరాజ్ చేతిలోకి వెళ్లేసరికి పాతబడిపోయింది. దాంతో సిరాజ్ ప్రయోగాలు చేయలేకపోయారు. ఈ విషయం చూసిన అందరికీ స్పష్టంగా తెలిసింది. ఈ లోపల లోపాలన్నిటినీ సరి చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు టీమిండియాపై ఉంది. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఇంగ్లాండ్ జట్టుకి టీమిండియా ని అణగదొక్కడానికి చేతులారా అవకాశం కల్పించినట్లు అవుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో ఎంత త్వరగా బౌన్స్ బ్యాక్ అయితే అంత మంచిది అని అంటున్నారు.


End of Article

You may also like