20 కిలోలు బరువు తగ్గితేనే ఐపీఎల్ లోకి తీసుకుంటన్న “ధోని”..కానీ అతను ఇప్పుడు 5 కిలోలు పెరిగాడు.!

20 కిలోలు బరువు తగ్గితేనే ఐపీఎల్ లోకి తీసుకుంటన్న “ధోని”..కానీ అతను ఇప్పుడు 5 కిలోలు పెరిగాడు.!

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం క్రికెటర్లందరూ ఫిట్ నెస్ కి అధిక ప్రాధాన్యం చేస్తున్నారు. గ్రౌండ్ లో గాయాల బారిన పడకుండా ఉండాలంటే ఫిట్ నెస్ కీలకమని ప్రతి ఆటగాడు తెలుసుకుంటున్నాడు. అందుకోసం గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. తమని తాము ఫిట్ గా ఉంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఫిట్ నెస్ టాపిక్ వస్తే అందరికంటే ముందు గుర్తొచ్చేది భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉంటాడు. క్రికెట్ మ్యాచ్ లు ఉన్నా లేకపోయినా కూడా తన దినచర్యలో ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది.

Video Advertisement

ms-dhoni-1

అయితే కొందరి క్రికెటర్లకు అద్భుతమైన టాలెంట్ ఉన్నా కూడా తమను తాము ఫిట్ గా ఉంచుకోవడంలో విఫలం అవుతూ ఉంటారు. మంచి టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ వారు ఫిట్‌నెస్ ను ఏ మాత్రం ప‌ట్టించుకోరు. ఈ జాబితాలోకే వ‌స్తాడు అఫ్గానిస్తాన్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మ‌ద్ షాజాద్‌.

చూడ‌డానికి కొంచెం లావుగా ఉన్న‌ప్ప‌టికీ అద్భుమైన టాలెంట్ ఈ ఆటగాడి సొంతం. 35 ఏళ్ల ఈ క్రికెట‌ర్ భారీ షాట్ల‌ను అవ‌లీల కొట్టేస్తాడు. అఫ్గానిస్థాన్ క్రికెట‌ర్ల‌లో ఇత‌డు చాలా కీల‌కం. అఫ్గానిస్థాన్ త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు రెండు టెస్టులు, 84 వ‌న్డేలు, 73 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 69 ప‌రుగులు, వ‌న్డేల్లో ఆరు సెంచ‌రీలు, 14 హాఫ్ సెంచ‌రీల సాయంతో 2727 ప‌రుగులు, టీ20ల్లో ఓ సెంచ‌రీ, 12 అర్ధ‌శ‌త‌కాల‌తో 2048 ప‌రుగులు చేశాడు.

అయితే ఎంత బాగా ఆడుతున్న‌ప్ప‌టికీ అత‌డి బ‌రువు గురించి ఏప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. మ‌హ్మ‌ద్ షాజాద్ గురించి అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోనిల మ‌ధ్య‌ జ‌రిగిన ఓ స‌రదా సంభాష‌ణ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. షాజాద్ గ‌నుక 20 కిలోల బ‌రువు త‌గ్గితే అత‌డిని ఐపీఎల్‌లో ఆడిస్తాన‌ని ధోని చెప్పాడట.అయితే షాజాద్ మాత్రం మ‌రో ఐదు కిలోల బ‌రువు పెరిగాడంటూ అస్గర్ ఆఫ్ఘన్ చెప్పాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాజాగా అత‌డు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.


End of Article

You may also like