“ఎంపికని ఆపలేదు..!” అంటూ… MSK ప్రసాద్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“ఎంపికని ఆపలేదు..!” అంటూ… MSK ప్రసాద్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

భారత క్రికెటర్, ఐపీఎల్ లెజెండ్ అయిన అంబటి రాయుడు రీసెంట్ గా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తరువాత అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019 వరల్డ్ కప్‌ జట్టులో తనను సెలెక్ట్ చేయకపోవడం గురించి వెల్లడించారు.

Video Advertisement

ఆంధ్రా జట్టుకు ఆడేప్పుడు దానికి కెప్టెన్ గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌ తో విభేదాలు ఏర్పడ్డాయని అన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ 2019 వరల్డ్ కప్ సెలెక్షన్ కమిటీకి చీఫ్‌గా ఉన్నాడని, తనను ఎందుకు సెలెక్ట్ చేయలేదనే విషయం ఆయనే చెప్పాలని రాయుడు అన్నారు. తాజాగా రాయుడి కామెంట్స్ పై ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పందించారు.
ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట్లాడుతూ, సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారని, ఆ సభ్యులతో పాటు జట్టు కెప్టెన్ ఉంటాడు. అందులో ఒక్కరి నిర్ణయాన్ని అందరు ఎలా ఒప్పుకుంటారు? అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని  అన్నారు. ఎవరో ఒక్కరు మాత్రమే నిర్ణయం తీసుకుంటే, కమిటీలో ఐదుగురు సెలెక్టర్లు ఎందుకు? అని ప్రశ్నించాడు. సెలెక్షన్ కమిటీ ఒప్పుకోకుండా ఏ డీసీషన్ తీసుకోలేమని చెప్పారు. నేను ఏదైనా చెప్పవచ్చు. కానీ మిగతా సభ్యులు దాన్ని అంగీకరించాలి. సెలెక్షన్ కమిటీలో ఎవరో ఒక్కరి డీసీషన్ నిలవదని వెల్లడించాడు.
రాయుడును సెలెక్ట్ చేయకపోవడం అనేది కమిటీ మొత్తం కలిసి తీసుకున్న డీసీషన్ అని చెప్పాడు. ఇక ఆంధ్రా జట్టుకు ఆడే టైమ్ లో రాయుడితో ఉన్న విభేదాల గురించి ఎమ్మెస్కే ప్రస్తావించాడు. ఒక జట్టులో చాలా రోజులు ఆడినప్పుడు ప్లేయర్స్ మద్య చిన్న చిన్న విబేధాలు సాధారణంగా జరుగుతుంటాయి. అన్నదమ్ముల మధ్యలో సైతం  అభిప్రాయభేదాలు వస్తాయి. టీంఇండియాకు సెలెక్ట్ చేయడం లాంటి పెద్ద విషయంలో చిన్న చిన్న గొడవలను పట్టించుకోవాల్సింది ఏముంటుందని అన్నాడు.
అలాగే వరల్డ్ కప్ ముందు జరిగిన మ్యాచ్ లలో రాయుడిని ఎంపిక చేసిన సంగతిని గుర్తు చేశాడు. వరల్డ్ కప్ ముందు ఆడిన మ్యాచ్ లన్నింటికి రాయుడిని సెలెక్ట్ చేశాం. అప్పుడు లేని సమస్య, వరల్డ్ కప్ ఎంపికలో ఏముంటుందని అన్నారు. ఎంపిక ప్రక్రియ కమిటీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. వరల్డ్ కప్ సెలెక్షన్ లో తనపై వచ్చిన ఆరోపణల గురించి క్లారిటీ ఇవ్వడానికే వచ్చానని ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Also Read: “డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయాలా..?” అంటూ… ఫైర్ అవుతున్న గంభీర్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like