Ads
ఐపీఎల్ ద్వారా ఇప్పటిదాకా ఎందరో స్టార్ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఈ లీగ్‌లో తమ సత్తాను చాటితే, సులభంగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకోవచ్చు. అయితే ఎంతోమంది క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించు కోవడానికి తపిస్తున్నారు.
Video Advertisement
ఈ నేపద్యంలో ముంబై ఇండియన్స్ జట్టు నుండి సరికొత్త బ్యాట్స్‌మెన్ వచ్చాడని చెప్పవచ్చు. అతనే తెలుగు యువకుడు తిలక్ వర్మ. గత ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికి అతనికి అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్ లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అతని పేరే వినిపిస్తోంది.
ఇక మంగళవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ తన బ్యాటింగ్ తో మరోసారి అదరగొట్టాడు. ముంబై జట్టు గెలుపులో ముఖ్య పాత్రను పోషించాడు. కీలక తరుణంలో బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ 29 బాల్స్ లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 41 పరుగులతో ముంబై జట్టుకు గెలుపును మరింత దగ్గర చేశాడు. ఈ సీజన్‌లో తిలక్ ఇప్పటి దాకా 3 మ్యాచ్‌లు ఆడి, 147 పరుగులు చేశాడు. ముంబై జట్టులో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో అందరిని ఆకర్షించాడు. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కీలక సమయంలో తిలక్ ఆడిన అద్బుత ఇన్నింగ్స్ గురించి మాటల్లో చెప్పలేము. ఈ మ్యాచ్‌లో 46 బంతులలో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో కొట్టి, 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఐపీఎల్ 2023 లో దుమ్మురేపుతున్న ఈ హైదరాబాదీ ఆటగాడి పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తిలక్ వర్మ ముంబై జట్టుకి లభించిన విలువైన ఆస్తి’ అంటూ కామెంటర్ హార్షా బోగ్లే ట్విటర్ ఖాతాలో తిలక్ ను అభినందించాడు. మిడిలార్డర్‌లో రాణించే ప్రతిభ కలిగిన తిలక్, టీమిండియా జట్టులోకి తప్పక వస్తాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “అది ఒక కాలరాత్రి, బాధతో అన్నం కూడా ముట్టడం లేదు..!” అంటూ… బాధపడిన “యష్ దయాల్” తండ్రి..!
End of Article