Ads
ఇండియన్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా ఎంఎస్ ధోని సంచలనం సృష్టించాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ధోని భారత జట్టుకు ఆడే సమయంలో కెప్టెన్ గా అనేక సందర్భాల్లో ఎవరు ఊహించని నిర్ణయాలను తీసుకున్నాడు. తన నిర్ణయాలతో ధోని ఒక్కోసారి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిస్తే, ఇంకోసారి షాక్ అయ్యేలా చేసేవాడు.
Video Advertisement
ధోని ఏం చేసిన క్రికెట్ ప్రియులను మాత్రం అలరించేవాడు. ఇక ధోని తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయాయి. ధోని ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అతనికే తెలుసు. అయితే ఆ నిర్ణయాలలో అతి కీలకమైన నిర్ణయం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసని స్పిన్ మాంత్రికుడు, శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ తాజాగా చెప్పుకొచ్చాడు. మరి ముత్తయ్య మురళీధరన్ చెప్పిన ఆ సీక్రెట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.. భారత్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ 2011 ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకతో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని తీసుకున్న నిర్ణయం క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. చేజింగ్ టైంలో బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్ద మార్పు చేశాడు. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేయాల్సిన 5 వ స్థానంలో ధోని వచ్చాడు. అసలు ధోని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడనేది ఇప్పటికీ మిస్టరీనే. తాజాగా ముత్తయ్య మురళీధరన్ వరల్డ్‌కప్ 2011 ఫైనల్ లో ధోని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో తనకు తెలుసు అని అన్నారు. మురళీధరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ధోని యువరాజ్ సింగ్ కన్నా ముందుగా బ్యాటింగ్ చేయడానికి కారణం నేనే. దానికి కారణం యువరాజ్‌కి నా బౌలింగ్‌లో రికార్డ్ పెద్దగా లేదు. అయితే ధోనికి ఉంది.అది మాత్రమే కాకుండా ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. దాంతో నేను వేసే బంతులను ఆడిన ఎక్స్పీరియన్స్ ధోనికి ఎక్కువగా ఉంది. అందువల్లే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు’ అని అన్నారు. అయితే దీనిలో వాస్తవం ఎంతవరకు ఉందో ధోని చెప్తేనే తెలుస్తుంది.
Also Read: “ఇంత దానికీ ఈ మ్యాచ్ లు అవసరమా..?” అంటూ… BCCI పై “హైదరాబాద్” ప్రజల ఆగ్రహం..! కారణం ఏంటంటే..?
End of Article